బాంబు పేల్చిన గెహానా, అలా చేస్తే అరెస్ట్ ఉండదనన్నారు.. బలవంతం చేస్తే పేమెంట్ ఎందుకు?

అశ్లీల చిత్రాలు రూపొందించి ఒక యాప్ ద్వారా వాటిని ప్రసారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టయి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అనేక మలుపులు తిరుగుతోంది తాజాగా రాజ్ కుంద్రా తో కలిసి కొన్ని పోర్న్ ఫిలింస్ చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న గెహనా వశిష్ఠ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

నాలుగు నెలలు జైల్లో

నాలుగు నెలలు జైల్లో


తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో అశ్లీల కేసులో అరెస్టయిన నటి గెహనా, తనను అరెస్టు చేయడానికి వచ్చిన ముంబై పోలీసు బృందం తనను తప్పించుకోవడానికి రూ .15 లక్షలు లంచం ఇవ్వాలని కోరినట్లు పేర్కొంది. నిజానికి గెహానా వశిష్ట్ 2021 ఫిబ్రవరి నెలలో అరెస్టయ్యారు. మరియు దాదాపు నాలుగు నెలలు జైలులో కూడా ఉన్నారు.

నన్ను 15 లక్షలు అడిగారు

నన్ను 15 లక్షలు అడిగారు

జాతీయ మీడియాతో శనివారం జరిగిన ప్రత్యేక సంభాషణలో, గెహనా వశిష్ఠ్ మాట్లాడుతూ తనకు 15 లక్షలు చెల్లించాలని పోలీసులు డిమాండ్ చేశారు. "నన్ను విడుదల చేయడానికి వారు 15 లక్షలు తీసుకోవాలనుకున్నారు. వారు నన్ను డబ్బు చెల్లించమని అడిగారు. కానీ నేను తప్పు చేయలేదని నేను చెప్పినప్పుడు, మేము ఎవరిపైనైనా కేసు పెట్టవచ్చని వారు చెప్పారు, "అని గేహన వశిష్ఠ్ ఆరోపించారు.

వాళ్ళని కూడా అగిగారు

వాళ్ళని కూడా అగిగారు


ఈ కేసులో ఇద్దరు నిందితుల మధ్య వాట్సాప్ చాట్‌ను కూడా నటి ఉదహరించింది, యశ్ ఠాకూర్ అలియాస్ అరవింద్‌కుమార్ శ్రీవాస్తవ మరియు తన్వీర్ హష్మి. ఇద్దరూ రూ .8 లక్షలు పోలీసుల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చాట్ లో ఉందని గెహనా వశిష్ఠ్ చెప్పారు. "ఎందుకంటే పోలీసులు వారిని కూడా డబ్బు డిమాండ్ చేశారు" అని గెహనా వశిష్ఠ్ అన్నారు.

 బలవంతం చేస్తే పేమెంట్ ఎందుకు

బలవంతం చేస్తే పేమెంట్ ఎందుకు

ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో తనపై అశ్లీల కేసుకి సంబంధించి తాజా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినప్పుడు, తన మీద ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారు రెండు మూడు అడల్ట్ వీడియోలలో నటించిందని ఆమె పేర్కొన్నారు. ఆమెను వివిధ వ్యక్తులు బలవంతంగా అనేకసార్లు బలవంతం చేస్తే, దాని కోసం మేమెందుకు పేమెంట్ చేస్తామని గెహనా వశిష్ఠ్ ప్రశ్నించారు.

అలా ఒత్తిడి చేసిందని

అలా ఒత్తిడి చేసిందని

ఇక గెహనా వశిష్ఠ్ తో పాటు, ఈ కేసులో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కంపెనీ నిర్మాతల పేర్లు కూడా ఉన్నాయి. హాట్ షాట్ యాప్ కోసం నటించిన ఒక నటి పోలీసులను ఆశ్రయించడంతో హాట్‌షాట్ యాప్ కోసం తనను అశ్లీల సినిమాలో నటించేలా ఒత్తిడి చేయడం అనే అంశం మీద కేసు నమోదు చేయబడింది.

Recommended Video

Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
పెద్ద సెక్షన్లే

పెద్ద సెక్షన్లే


ఇక ఈ కేసులో 420 (చీటింగ్), 392 (దోపిడీకి శిక్ష), 393 (దోపిడీకి ప్రయత్నించడం) మరియు వుమెన్ ప్రొహిబిషన్ చట్టం సహా వివిధ IPC సెక్షన్ల కింద నమోదు చేయబడింది. దీనికి సైబర్ చట్టాలు కూడా జోడించారు. ఇక బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను జూలై 19 న అశ్లీల చిత్రాల సృష్టి మరియు యాప్‌ల ద్వారా ప్రచురించిన కేసులో క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసిందన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X