For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raj Kundra : డ్రగ్స్ ఇచ్చి పోర్న్ షూట్.. నన్ను కూడా అడిగారు, బయటపడిన మరో నటి!

  |

  రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత దేశంలో పోర్న్ చిత్రాలకు సంబంధించిన చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. చాలా మంది మోడల్స్, నటీమణులు ఈ 'డర్టీ పిక్చర్' వ్యాపారం రహస్యాలను పోలీసులతో పాటు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాజాగా నటి శృతి గెరా చేసిన తాజా కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

  డ్రగ్స్ ఇచ్చి

  డ్రగ్స్ ఇచ్చి

  తాజాగా ఈ విషయం మీద స్పందించిన శృతి గెరా పరిశ్రమలో కొత్త నటీమణులకు మొదట డ్రగ్స్ ఇచ్చి, నగ్న వీడియోలను చిత్రీకరిస్తారని చెప్పి బాంబు పేల్చింది. ఆపై వారు డ్రగ్స్ కు అలవాటు పడి, బ్లాక్ మెయిలింగ్ ద్వారా పోర్న్ ఫిల్మ్‌లలో పని చేయవలసి వస్తుంది అని శృతి చెప్పారు. వెబ్ షోల కోసం కాంట్రాక్టులపై సంతకం చేయడానికి మోడల్స్, నటీమణులను రాజ్ కుంద్రా సంస్థ ఉపయోగించుకుంటుందన్న విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది.

  ఆఫర్ వచ్చింది

  ఆఫర్ వచ్చింది

  ఇక ఆ తరువాత వారు పరిమితులను దాటి అశ్లీల చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది నటీమణులు రాజ్ కంపెనీ 'న్యూడ్ ఆడిషన్ క్లిప్స్' కోరినట్లు శృతి ఆరోపించారు. ఓ ఫేమస్ మీడియా సంస్థతో శృతి గెరా మాట్లాడుతూ 2018 సంవత్సరంలో వెబ్ సిరీస్‌లో పని చేయడానికి రాజ్ కుంద్రా సంస్థ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని ఆమె వెల్లడించింది.

  ముంబైలో మరో రెండిళ్ళు అమ్మేసిన ప్రియాంకా చోప్రా.. ఎన్ని కోట్లకో తెలుసా?

  తిరస్కరించిందట

  తిరస్కరించిందట

  కానీ తనను ఏ కాస్టింగ్ డైరెక్టర్ సంప్రదించారనే విషయం మాత్రం సరిగ్గా గుర్తులేదని, రాజ్ కుంద్రాకు తనను పరిచయం చేస్తానని ఒకరు చెప్పారని, రాజ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభిస్తున్నాడని, వెబ్ షోల ప్రపంచంలో చురుగ్గా పని చేయబోతున్నాడని చెప్పారని పేర్కొంది. అయితే ఆమె వెంటనే ఆ ఆఫర్లను తిరస్కరించిందట.

  దేవుడికి కృతజ్ఞతలు

  దేవుడికి కృతజ్ఞతలు


  అయితే తనను ముందుగా ఈ ఉచ్చు నుంచి కాపాడినందుకు శృతి దేవుడికి కృతజ్ఞతలు చెప్పింది. రాజ్ ను పెద్ద మనిషి అని, మంచి మనసున్న వ్యక్తి అని మనమందరం అనుకున్నాము కానీ ఇప్పుడు అతను పోర్న్ సినిమాలు చేసేవాడు అని తెలిసింది. పోర్న్ చిత్రాలకు కొత్త నటులను, మోడళ్లను నిందించడం సరికాదని శృతి గేరా అన్నారు.

  వామ్మో, ఇదేంది గురూ తేడాగా ఉంది.. కుర్రహీరోకి రానా ఆసక్తికర ట్వీట్!

  Raj Kundra Case: Shilpa Shetty అరెస్ట్ అవకాశం.. Juhu Bungalow Raids | Filmibeat Telugu
  ఆ సంస్థ పనుల్లో బిజీ

  ఆ సంస్థ పనుల్లో బిజీ

  ఇక ఈ పరిశ్రమలో చాలా జరుగుతోందని నేను గ్రహించానని అన్నారు. కొత్తగా వచ్చిన నటీమణులకు డ్రగ్స్ ఇస్తారన్న ఆమె, వారి అభ్యంతరకరమైన వీడియోలను చిత్రీకరిస్తారు మరియు తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేసి అలాంటి సినిమాల్లో నటించేలా చేస్తారని ఇది చాలా సాధారణం అని అన్నారు. కానీ స్టార్స్ కు అలా జరగకపోవచ్చు అంటూ ఇండస్ట్రీలో జరుగుతున్న షాకింగ్ విషయాలు బయట పెట్టింది. 2009 సంవత్సరంలో శృతి గెరా'టాస్: ఎ ఫ్లిప్ ఆఫ్ డెస్టినీ' చిత్రంలో కనిపించారు. ఆమె 2018 నుంచి సినిమాలకు దూరమైంది. ఆమె సొంత స్క్రీన్ కేర్ సంస్థను ప్రారంభించి ఆ పనుల్లో బిజీగా ఉంది.

  English summary
  Actress Shruti Gera said she was approached by casting directors in 2018 for a web series created by Raj Kundra but she rejected it. and alleges that drugs link on porn shoots.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X