Don't Miss!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- News
ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Sidharth Shukla Death : షెహ్నాజ్ కు తీవ్ర అస్వస్థత.. విషాదంతో షూట్ సెట్ నుంచి నిష్క్రమణ?
నటుడు సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2వ తేదీ గురువారం గుండెపోటుతో మరణించారు. 40 ఏళ్ల నటుడు సిద్ధార్థ్ శుక్లా ఇంట్లో గుండెపోటు రావడంతో, అతని కుటుంబ సభ్యులు అతడిని కూపర్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సిద్ధార్థ్ మరణవార్త చూసి అందరూ షాక్ అయ్యారు. సిద్ధార్థ్ శుక్లా తల్లి మరియు సోదరీమణులు అయితే తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక అతని సన్నిహితుడు షెహనాజ్ గిల్ యొక్క బాధను అయితే ఊహించడం కష్టమే. అయితే మరణ వార్తని విని ఆమె షూట్ మధ్య నుంచి వచ్చేశారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

తీవ్ర విషాదం
బాలీవుడ్ నుంచి టీవీ ప్రపంచం వరకు తారలందరూ సిద్ధార్థ్ శుక్లాకు నివాళి అర్పిస్తున్నారు. చాలా సంవత్సరాలు మోడలింగ్ చేసిన తర్వాత, సిద్ధార్థ్ శుక్లా నటనా ప్రపంచంలోకి ప్రవేశించాడు. సిద్ధార్థ్ శుక్లా బాలికా వధు, దిల్ సే దిల్ తక్, ఖత్రోం కే ఖిలాడీ వంటి అనేక మంచి సీరియల్స్ లో భాగం అయ్యాడు. అయితే, అతను బిగ్ బాస్ -13 విన్నర్ అయ్యాక అత్యంత ప్రజాదరణ పొందారు.

బిగ్ బాస్ లో కెమిస్ట్రీ
బిగ్ బాస్ లో సిద్ధార్థ్ శుక్లా మరియు పంజాబీ గాయని, నటి షెహ్నాజ్ గిల్‌తో శుక్లా రిలేషన్ బిగ్ బాస్‌లో బాగా నచ్చింది. బిగ్ బాస్ తర్వాత, అభిమానులు వారిద్దరినీ సిద్ధనాజ్ పేర్లతో పిలవడం ప్రారంభించారు. బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన సిద్ధార్థ్ శుక్లా మరియు షహనాజ్ గిల్ కెమిస్ట్రీ అయితే బాగా నచ్చేసింది. షో తర్వాత కూడా ఇద్దరూ తరచుగా కలిసి కనిపించేవారు. ఇద్దరూ అనేక మ్యూజిక్ ఆల్బమ్‌లలో కలిసి పనిచేశారు.

సిద్ధనాజ్ స్పెషల్
బిగ్ బాస్ OTT లో కూడా సిద్ధార్థ్ శుక్లా మరియు షహనాజ్ గిల్ వచ్చినప్పుడు, ఇద్దరి ఎపిసోడ్‌లకు సిద్ధనాజ్ స్పెషల్ అని పేరు పెట్టారు. సిద్ధనాజ్ వ్యవహారం మరియు వివాహం గురించి అభిమానులు నిరంతరం ఊహాగానాలు చేస్తు ఉండేవారు. కొంతకాలంగా, సిద్ధార్థ్ మరియు షహనాజ్ వివాహం గురించి చాలా చర్చ జరిగింది.
కానీ ఇద్దరూ దాని గురించి బహిరంగంగా మాట్లాడలేదు. అయితే, షహనాజ్ సిద్ధార్థ్ తల్లికి మరియు ఇద్దరు సోదరీమణులకు చాలా సన్నిహితురాలు. వారి పుట్టినరోజులు, ఈవెంట్‌లు మరియు సోషల్ మీడియా ఫోటోలలో షహానాజ్ తరచుగా సిద్ కుటుంబంతో కలిసి కనిపిస్తారు.

ప్రేమను చాలాసార్లు బహిరంగంగా
'బిగ్ బాస్ 13'లో సిద్దార్థ్ తనకు షహనాజ్ అంటే ఇష్టమని ప్రకటించాడు, షహనాజ్ కూడా తన ప్రేమను బహిరంగంగా ప్రకటించారు. అయితే, ఈ బంధానికి సిద్ధార్థ్ మరియు షహనాజ్ ఎల్లప్పుడూ మంచి స్నేహితులు మాత్రమే అనే ట్యాగ్ ఇచ్చారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ అబూ మాలిక్ ఇద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు.
అబూ మాలిక్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు, 'షెహ్నాజ్ సిద్ధార్థ్‌పై తన ప్రేమను చాలాసార్లు బహిరంగంగా వ్యక్తం చేసింది. 'ముజ్సే షాది కరోగే'లో, ఆమె సిద్ధార్థ్‌పై తన ప్రేమను ఒప్పుకుంటూ ఏడ్చింది. సిద్దార్థ్ కారణంగానే షహనాజ్ తన స్వయంవరంలో ఏ అబ్బాయిని ఎంచుకోలేదు మరియు ఖాళీ చేతులతో తిరిగి వచ్చిందని వెల్లడించారు.
Recommended Video

షూటింగ్‌ను నిలిపివేసి
ఇక సిద్ధార్థ్ మరణవార్త అందిన వెంటనే షెహ్నాజ్ గిల్ తన షూటింగ్‌ను నిలిపివేసింది. స్పాట్‌ఓయ్ తో మాట్లాడుతూ షెహ్నాజ్ గిల్ తండ్రి సంతోఖ్ సింగ్ సుఖ్ మాట్లాడుతూ, ఈ వార్త వినగానే తాను షాక్ అయ్యానని, సిద్ధార్థ్ ఇక లేడని తనకు నమ్మశక్యంగా లేదని అన్నారు. సుఖ్ షెహ్నాజ్ గిల్‌తో మాట్లాడాడని మరియు ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పారు. సుఖ్ ప్రకారం, షెహనాజ్ సోదరుడు షెహబాజ్ కు తోడుగా ఉండటానికి ముంబై వెళ్లారు.