»   » భార్య ట్వీట్ వైరల్: రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి శభాష్ అనిపించుకున్న అక్షయ్ కుమార్!

భార్య ట్వీట్ వైరల్: రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి శభాష్ అనిపించుకున్న అక్షయ్ కుమార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలోని జుహు బీచ్‌లో మొబైల్ టాయిలెట్ కట్టించారు. కొన్ని నెలల క్రితం అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా చేసిన ట్విట్టర్ పోస్టు వైరల్ కావడంతో బీచ్‌లో టాయిల్ కట్టాలనే ఆలోచనకు వచ్చిన అక్షయ్ ఎట్టకేలకు దాన్ని ఏర్పాటు చేశారు.

తన సొంత ఖర్చులతో జుహూ బీచ్‌లో టాయిలెట్ నిర్మించాలనుకుంటున్నట్లు బృహన్ ముంబై మునిసిపల్ కార్పేషన్‌కు అక్షయ్ గతవారం అప్లికేషన్ పెట్టారని, అతడి కోరికను స్వాగతిస్తూ నాలుగు రోజుల క్రితం జుహూ బీచ్‌లో టాయిలెట్ ఏర్పాటు చేశాం. ఇందుకు అయిన రూ. 10 లక్షలు అక్షయ్ కుమార్ భరించారు అని అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ ఆఫ్ కె వార్డ్ ప్రశాంత్ గైక్వాడ్ వెల్లడించారు.

ఈ మొబైల్ టాయిలెట్‌ను అందరూ ఉచితంగా వాడుకోవచ్చని, దీన్ని మెయింటేన్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే.. పే అండ్ యూజ్ బేసిస్‌లో సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.

గతేడాది ఆగస్టులో అక్షయ్ కుమార్ భార్య ట్వింకల్ ఖన్నా చేసిన ట్వీట్ వైరల్ అయింది. సరదాగా వాకింగ్ చేసుకుంటూ బీచ్ వైపు వచ్చిన ఆమె అక్కడ ఓ యువకుడు బహిరంగ మల విసర్జన చేయడాన్ని ఫోటో తీసి పోస్టు చేవారు. ఆ సమయంలో అక్షయ్ కుమార్ 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా' చిత్రంలో నటిస్తున్నారు. ఆమె పోస్టు చేసిన ఫోటోకు 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా పార్ట్ 2 ఫస్ట్ సీన్ ఇదే అవుతుందేమో అంటూ వ్యగ్యంగా ట్వీట్ చేశారు.

English summary
Actor Akshay Kumar has sponsored a mobile toilet near the famous Juhu beach in Mumbai, months after his wife tweeted a picture of a man defecating at another sea shore in Mumbai. Last week, the actor sent an application to the Brihanmumbai Municipal Corporation (BMC) offering to set up the toilet by bearing all its expenses, assistant municipal commissioner of K-ward, Prashant Gaikwad, said.“We welcomed his initiative and installed the toilet near the Juhu beach four days ago. The actor bore all the expenses, Rs 10 lakh, for setting up the portable toilet,” he told PTI.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X