»   » దాన్ని ఛీ కొట్టినందుకు భర్తకు తగిన పనిష్మెంట్ ఇచ్చిన ఐశ్వర్యరాయ్!

దాన్ని ఛీ కొట్టినందుకు భర్తకు తగిన పనిష్మెంట్ ఇచ్చిన ఐశ్వర్యరాయ్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Abhishek Bachchan Tweets About Food To Aishwarya Rai Bachchan

  బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య ట్విట్టర్లో జరిగిన ఓ సంఘటన ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బ్రకోలిని ఛీ కొడుతూ అభిషేక్ తన ట్వీట్టర్‌ ఖాతాలో ఓ పోస్టు చేశారు. వెజిటబుల్స్‌లో ఇది తనకు అస్సలు నచ్చదని, అదంటే అసహ్యం అంటూ పేర్కొన్నారు. దీనికి తన భార్య ఐశ్వర్యరాయ్ ఎలా రియాక్ట్ అయిందో వెల్లడిస్తూ అభిషేక్ మరో పోస్టు చేశారు. ఈ ట్వీట్స్ చూసిన అభిమానులు భర్తకు ఐశ్వర్యరాయ్ తగిన పనిష్మెంట్ ఇచ్చింది అంటూ జోకులేసుకుంటున్నారు.

  అభిషేక్ ఏమని ట్వీట్ చేశారు?

  అభిషేక్ ఏమని ట్వీట్ చేశారు?

  ఎందుకు? ఎవరైనా ఇలా చేస్తారా? అసలు బ్రకోలీ అంటే ఇష్టపడేవాళ్లు కూడా ఉంటారా?' అంటూ బ్రకోలిపై తన అయిస్టాన్ని వెల్లడిస్తూ అభిషేక్ బచ్చన్ ఓ ట్వీట్‌ చేశారు.

  భర్తకు ఐష్ పనిష్మెంట్

  భర్తకు ఐష్ పనిష్మెంట్

  ఎన్నో పోషకాలను ఇచ్చే, ఆరోగ్యకరమైన బ్రకోలి గరించి అభి అలాంటి కామెంట్ చేయడంతో..... దాని విలువ తెలిసేలా బ్రకోలి, టమోటోలతో ఐష్ ఓ ప్రత్చేక వంటకం తయారు చేసి భర్తకు వడ్డించింది. ఆ వంటకం ఫొటోను అభి ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ..‘మా ఆవిడ నా ట్వీట్‌ చదివినట్లుంది, అందుకే దీన్ని నాతో బలవంతంగా తినిపించే ప్రయత్నం చేస్తోంది' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ అభికి ఐష్ తగిన పనిష్మెంట్ ఇచ్చింది అంటూ చర్చించుకుంటున్నారు.

  భర్తపై ఓ కన్నేసి ఉంచిందా?

  భర్తపై ఓ కన్నేసి ఉంచిందా?

  ఐశ్వర్యరాయ్ ఇంకా ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయలేదు. అయినప్పటికీ అభిషేక్ ట్విట్లపై ఆమె కన్నేసి ఉంచిందని ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు సోషల్ మీడియాలో అభి ప్రతి యాక్టివిటీని ఐష్ ఎప్పుడూ మనిటరింగ్ చేస్తూ ఉంటుందట.

  భర్త మీద ఎంత ప్రేమో...

  భర్త మీద ఎంత ప్రేమో...

  ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన ఐశ్వర్యను ఇంటర్నేషనల్ మీడియా..... మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అని అడిగిన ప్రశ్నకు అభిషేక్ అంటూ సమాధానం ఇచ్చింది. అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కూడా తన భర్త గురించి ఎంత గొప్పగా చెప్పింది ఈ మాజీ విశ్వసుందరి.

  ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన ఐష్

  ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన ఐష్

  ఐశ్వర్యరాయ్ మొదటి నుండి సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇటీవల కేన్స్ ఫెస్టివల్‌కు ముందే ఆమె అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచారు. అప్పుడే ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య 3.2 మిలియన్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఐష్ ‘ఫన్నే ఖాన్' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఐష్‌తో పాటు అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

  English summary
  How many of you hate green veggies in your food? If yes, then you have something common with Abhishek Bachchan. Recently the actor professed his profound dislike for broccoli on his Twitter page. Poor Abhi! He wasn't aware what was in store for him next!. To the actor's surprise, soon after his tweet, his wife Aishwarya Rai Bachchan, served him quinoa salad with broccoli and tomatoes for a meal.
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more