For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Alia Bhatt: కూతురుని ఎత్తుకుని కనిపించిన రణ్ బీర్ జంట.. అలియా భట్ బేబీని చూశారా?

  |

  స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్​ సినిమాతో బాలీవుడ్ చిత్రసీమకు హీరోయిన్​గా పరిచయమైన ముద్దుగుమ్మ అలియా భట్​. ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు మహేశ్ భట్​ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈ క్యూట్ ఫుల్ హీరోయిన్ 2 స్టేట్స్​, హైవే, డియర్​ జిందగీ, ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీ బాయ్​, కలంక్​ వంటి తదితర సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

  ఈ సినిమాల్లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే RRR​ సినిమాలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇటీవల తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను పెళ్లాడిన అలియా భట్ ఇటీవల డెలివరీ అయిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు తన బేబీతో కలిసి దర్శనమిచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

  నవంబర్ 6న డెలివరీ..

  బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ రణ్ బీర్ కపూర్ అండ్ అలియా భట్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. అలియా భట్ ఇవాళ అంటే నవంబర్ 6 ఆదివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అలియా భట్ కు మరో క్యూటి అమ్మాయి పుట్టింది. సౌత్ ముంబైలో ఉన్న గిరిగావ్ లోని హెచ్ఎన్ రియలన్స్ ఆసుపత్రిలో అలియా భట్ ప్రసవం జరిగింది. దీంతో అటు కపూర్ ఫ్యామిలీ, ఇటు భట్ ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయారు.

  ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..

  తమకు అమ్మాయి పుట్టిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన అలియా భట్ కు సెలబ్రిటీల నుంచి నెటిజన్ల వరకు శుభాకాంక్షలు వెలువెత్తాయి. ఇక ఇటీవల అలియా భట్ కూతురుకి అల్మా అని అబ్బాయి పేరు పెడతారన్న చర్చ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా అలియా భట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. తల్లి బిడ్డ ఆరోగ్యం బాగుండటంతో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.

  వీడియో వైరల్..

  అలియా భట్ డిశ్చార్జ్ సమయంలో తమ కూతురిని రణ్ బీర్ కపూర్ ఎత్తుకుని కనిపించాడు. అలియా భట్ ఆస్పత్రి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు రాగా ఆమె భర్త రణ్ బీర్ కపూర్ పాపను ఎత్తుకుని కనిపించాడు. హాస్పిటల్ నుంచి మూడు రేంజ్ రోవర్ కార్లలో అలియా భట్ అండ్ రణ్ బీర్ కపూర్ కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  ఆ జాబితాలో రణ్ బీర్ జంట..

  ఆ జాబితాలో రణ్ బీర్ జంట..

  అలియా భట్ పాప ఫొటోల్ని తీసుకునేందుకు ఫొటోగ్రాఫర్స్ ప్రయత్నించారు. కానీ అందుకు మీడియా సభ్యుల్ని అనుమతించలేదు. అలాగే కారులో వెళ్తున్న సమయంలో కూడా బేబీ మొహం కనిపించకుండా కుటుంబ సభ్యలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల సెలబ్రిటీలు తమ కుమార్తె, కుమారులు ముఖాలను కనిపించకుండా జాగ్రత్త పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితోలో రణ్ బీర్ జంట కూడా చేరినట్లు తెలుస్తోంది.

  ఫేక్ వీడియో అండ్ ఫోటో??

  అయితే ఒక డాక్టర్ మాత్రం అలియా భట్ తన కూతురును ముద్దాడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఫిల్మీ ఎక్స్ ప్రెస్ అనే సంస్థ అలియా భట్ బేబీని ఎత్తుకున్న ఆసుపత్రిలో ఉన్న పిక్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు అలియా భట్ బేబీ ఫస్ట్ ఫొటో అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ ఫొటో అండ్ వీడియో ఫేక్ అని తెలుస్తోంది.

  ఏప్రిల్ 14న వివాహబంధంతో..

  బాలీవుడ్ కపుల్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ గత కొంతకాలంగా లవ్ ఉన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు చిగురు వేయడానికి కారణం బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్. చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన రెండు నెలలకే అలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులను, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.

  బ్రహ్మాస్త్ర సినిమానే కారణం..

  బ్రహ్మాస్త్ర సినిమానే కారణం..

  అలియా భట్ ప్రెగ్నెన్సీ అని ప్రకటించడంతో సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోలింగ్స్ తెగ పుట్టుకొచ్చాయి. అయితే ఆ వార్త కొంతమందికి సందేహాలు తీసుకొస్తే మరికొంతమందికి సర్ ప్రైజింగ్ గా అనిపించింది. పెళ్లికి ముందే అలియా భట్ ప్రెగ్నెంట్ అని, అందుకే హడావిడిగా వివాహం చేశారని రూమర్స్ సైతం వచ్చాయి. రణ్ బీర్, అలియా ప్రేమకథకు బ్రహ్మాస్త్ర సినిమా కారణమని తెలిసిందే.

  English summary
  Bollywood Couples Alia Bhatt Ranbir Kapoor Welcomes Their First Baby Girl Child And Their Baby First Video Goes Viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X