Alia Bhatt wedding Ranbir Kapoor పెళ్లి తర్వాత ముద్దుల్లో మునిగిన దంపతులు.. చీర్స్ కొడుతూ హ్యాపీగా..
బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ తమ డేటింగ్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి దాంపత్య జీవితానికి స్వాగతం పలికారు. హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో, హీరోయిన్లగా చెలామణి అవుతున్న రణ్ బీర్, ఆలియా భట్ ముంబైలోని తమ వారసత్వ నివాసం ఆర్కే హౌజ్‌లో వివాహం చేసుకొన్నారు. ఈ స్టార్ కపుల్ మ్యారేజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఐదేళ్ల రిలేషన్‌షిప్‌కు గుడ్‌బై
గత ఐదేళ్లుగా రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వారి డేటింగ్ వ్యవహారం మీడియాలో పతాక శీర్షికలను పలుమార్లు ఆకర్షించింది. అయితే రెండు, మూడేళ్ల క్రితమే ఆలియా, రణ్‌బీర్ పెళ్లి జరగాల్సింది. కానీ రణ్‌బీర్ తండ్రి, బాలీవుడ్ లెజెండ్ రిషి కపూర్ అనారోగ్యం, మరణంతో వాయిదా పడుతూ వచ్చింది.

పంజాబీ సంప్రదాయం ప్రకారం..
అయితే ఏప్రిల్ 14వ తేదీన పంజాబీ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాలకు సంబంధించిన కొందరు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో కరీనా కపూర్, కరిష్మాకపూర్‌తోపాటు భూమీ పడ్నేకర్, మౌనీరాయ్, పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

రణ్‌బీర్, ఆలియాభట్ జోష్‌గా
పెళ్లి తర్వాత రణ్‌బీర్, ఆలియాభట్ జోష్‌గా ఆనందంతో కనిపించారు. సంప్రదాయం ప్రకారం ఇద్దరు వైన్ తాగుతూ ఫోటోలకు ఫోజిచ్చారు. ఆలియా భట్ తల్లి తన కూతురు వివాహానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అధికారికంగా ప్రకటించారు. రణబీర్ తల్లి నీతూ కపూర్ తన కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతూ కనిపించారు.

ఆలియాభట్ తల్లి సోని రజ్దాన్ భావోద్వేగం
రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లి తర్వాత ఆలియాభట్ గురించి ఆమె తల్లి సోని రజ్దాన్ భావోద్వేగానికి గురయ్యారు. నీవు కూతురుకు దూరమైతే.. కొడుకు రూపంలో రణ్‌బీర్ మీకు చేరువయ్యారని నా కుటుంబ సభ్యులు అన్నారు. నిజానికి నాకు రణ్‌బీర్ కపూర్ లాంటి కొడుకు లభించాడనే సంతోషం కలిగింది. రణ్‌బీర్, ఆలియా జీవితంలో ఎనలేని ప్రేమ, సంతోషం ఉండాలని కోరుకొంటున్నాను అని సోని రజ్దాన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Recommended Video


మా జీవిత ప్రయాణంలో అంటూ ఆలియాభట్
ఆలియా భట్ తన పెళ్లి గురించి తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. నా స్నేహితులు, కుటుంబ సభ్యుల దీవెనల మధ్య నాకు ఇష్టమైన ఇంటిలో వివాహం జరిగింది. ఐదేళ్ల మా రిలేషన్‌షిప్‌లో మేము ఈ ఇంటి బాల్కనీలో ఎన్నో గంటలు గడిపాం. ఎన్నో మధురస్మృతులు మా జీవితాల్లో ఉన్నాయి. మా ఇద్దరి జీవితాల్లో ప్రేమ, నవ్వులు, సౌకర్యమైన మౌనం, సినిమాలు చూసిన ఎన్నో రాత్రులు, చిలిపి గొడవలు, వైన్ తాగుతూ గడిపిన క్షణాలు ఎన్నో గుర్తుకు వస్తున్నాయి. కానీ పెళ్లి రోజు నాకు మరింత స్పెషల్‌గా మారింది అని ఆలియాభట్ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











