Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Alia Bhatt: కెరీర్ టాప్ గేర్‌లో ఉండగా.. పెళ్లి చేసుకొని పిల్లల్ని ఎందుకు కన్నానంటే? ఆలియాభట్
తెలుగు ప్రేక్షకుల్లోనూ చెరగని ముద్ర వేసుకున్న బాలీవుడ్ భామల్లో అలియా భట్ ఒకరు. దర్శక ధీరుడు రాజమౌళి తరెకెక్కించిన RRR మూవీలో సీతగా తెలుగువారికి పరిచయమైన ఈ బ్యూటిని ఆడియెన్స్ బాగానే ఆదరించారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మహేశ్ భట్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ సుందరి బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ అలియా భట్.. తన కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని తల్లిగా మారింది. కెరీర్ పీక్స్ సమయంలో అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా వెల్లడించింది ఈ క్యూట్ బ్యూటి.

విమర్శకుల నుంచి ప్రశంసలు..
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమాతో హిందీ చిత్రసీమకు హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ అలియా భట్. బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ 2 స్టేట్స్, హైవే, డియర్ జిందగీ, ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీ బాయ్, కలంక్, గంగూ భాయ్ కతియవాడి వంటి తదితర సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాల్లో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.

వివాహబంధంతో ఒక్కటిగా..
ఇక తెలుగు దిగ్గజ దర్శకుడు రాజమౌళి చెక్కిన కళాఖండం RRR సినిమాలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అలియా భట్ కనిపించిన నిడివి తక్కువే అయినా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక బ్రహ్మాస్త్ర సినిమా సమయంలో కో యాక్టర్ రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ. ఈ ప్రేమ కాస్తా వివాహ బంధంతో ఒక్కటయ్యేలా చేసింది.

పాపకు జన్మనిచ్చిన అలియా..
చాలా కాలం పాటు రిలేషన్ షిప్ లో ఉన్న రణ్ బీర్ కపూర్, అలియా భట్ 2022 ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన రెండు నెలలకే అలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి ఆశ్చర్యపరిచిన అలియా భట్.. నవంబర్ 6న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సౌత్ ముంబై గిరిగావ్ లోని హెచ్ఎన్ రిలియన్స్ ఆసుపత్రిలో అలియా భట్ మరో క్యూట్ పాపకు జన్మనిచ్చింది. దీంతో కపూర్, భట్ ఫ్యామిలీలు తెగ సంబరపడిపోయాయి.

సినీ కెరీర్ పీక్ లో..
ఇదిలా ఉంటే వివాహం, ప్రెగ్నెన్సీకి ముందు అలియా భట్ సినీ కెరీర్ మంచి జోష్ మీద ఉంది. అప్పటికే హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ లో నటిస్తోంది. బేబీ బంప్ తో కూడా ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొంది అలియా భట్. అలా సినీ కెరీర్ బాగున్నప్పుడు తాను పెళ్లి చేసుకుని పిల్లలను ఎందుకు కనాల్సివచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మాతృత్వం వల్ల తన పనిలో మార్పు వస్తుందనే విషయాన్ని పట్టించుకోనని అని తెలిపింది అలియా భట్.

నాకు ఎలాంటి బాధ లేదు..
"అవును,
నా
కెరీర్
పీక్స్
లో
ఉన్నప్పుడు
నేను
పెళ్లి
చేసుకోవాలని,
ఒక
బిడ్డకు
జన్మనివ్వాలని
నిర్ణయించుకున్నాను.
అయితే
పెళ్లి,
పిల్లల
వల్ల
సినీ
కెరీర్
లో
మార్పులు
జరుగుతాయని
ఎవరు
చెప్పారు.
ఒకవేళ
మార్పులు
జరిగితే..
జరగని.
అది
అలాగే
ఉంటుంది.
అదంతా
నేను
పట్టించుకోను.
పిల్లలను
కనాలని
నిర్ణయించుకోవడంపై
నాకు
ఎలాంటి
బాధ
లేదు.
ఇది
చాలా
సహజమైంది.
ఇది
నేను
తీసుకున్న
అత్యుత్తమ
నిర్ణయం"
అని
అలియా
భట్
పేర్కొంది.