రెమ్యునరేషన్ లేకుండా.. సొంత ఖర్చులతో నటించిన అమితాబ్.. ఆ సినిమా ఏంటో తెలుసా?

ఇండియన్ సూపర్ స్టార్ ఎవరంటే ఠక్కున.. తడుముకోకుండా అమితాబ్ బచ్చన్ అని ఎవరైనా చెబుతారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో ఘనతలు, మైలురాళ్లు ఉన్నాయి. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్డబస్టర్లను అందుకొన్నారు. అయితే సుదీర్గమైన కెరీర్‌ను ఇంకా కొనసాగిస్తూ యువ హీరోలకు బిగ్ బీ పోటీగా నిలుస్తున్నారు. ఏ హీరో చేయని విధంగా సంవత్సరానిక రెండు, మూడు సినిమాలను అలవోకగా చేయడమే కాకుండా పలు రియాలిటీ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా అడ్వర్టయిజింగ్ రంగంలో స్టార్ హీరోల కంటే ఎక్కువగా యాడ్స్‌లో నటిసున్నారు. ఇలాంటి ఎన్నో ఘనతలు ఉన్న అమితాబ్ బచ్చన్ ప్రొఫెషనల్‌గా మరో ఘనతను అందుకొన్నారు. తాజాగా ఆయన చెహ్రా అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆయన చూపిన చొరవతో చిత్ర నిర్మాత రూమీ జాఫ్రీ ఫిదా అయిపోయారు. ఆ విషయాన్ని రూమీ జాఫ్రీ వెల్లడిస్తూ...

చహ్రే చిత్రం కోసం అమితాబ్ బచ్చన్ భారీగా రెమ్యునరేషన్ తీసుకొన్నారని అనుకొంటారు. కానీ ఆయన అలా చేయలేదు. బిగ్ బీ చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించారు. సినిమాకు ముందు చర్చ కోసం స్వయంగా తన కారులోనే వచ్చారు. ఆయనతో పనిచేయకున్నా బిగ్ బీ గురించి చాలా తెలుసుకొన్నాను అని రూమీ జాఫ్రీ తెలిపారు.

Amitabh Bachchan acted without rumuneration and own travel expenses for Chehre

ఇక రెండో హీరో గురించి వెతికే క్రమంలో ఇమ్రాన్ హష్మీని అనుకొన్నాం. ఆయన గురించి మాకు చాలానే తెలుసు. నేను ఎప్పడు పనిచేయకపోవడంతో ఏం చేయాలో తెలియక పలువురి సలహాలు తీసుకొని ఇమ్రాన్ ఆ పాత్రకు ఎంపిక చేశాం. ఆ తర్వాత ఈ సినిమా కోసం ఇమ్రాన్ చూపిన చొరవ, అంకితభావం వల్ల ఆ పాత్ర మరో రేంజ్‌లో వచ్చింది అని రూమీ అన్నారు.

ఇక అమితాబ్ చహ్రే చిత్రం కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. షూటింగు కోసం కూడా సొంత ఖర్చుల పెట్టుకొని షూటింగుకు హాజరయ్యారు. సొంత ఖర్చులతో విదేశీ ప్రయాణం చేశారు. అలా అమితాబ్ మా కోసం చాలా సహాయం చేశారు అని రూమీ జాఫ్రీ పేర్కొన్నారు. చహ్రే చిత్రంలో అమితాబ్, ఇమ్రాన్ హష్మీతోపాటు క్రిస్టల్ డిసౌజా, రియా చక్రవర్తి తదితరులు నటిస్తున్నారు.

చహ్రే చిత్రంతోపాటు అమితాబ్ బ్రహ్మస్త్ర, మేడే, గుడ్ బై, జుండ్, ది ఇంటెర్న్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల అమితాబ్ కౌన్ బనేగా కరోడ్‌పతి షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X