»   » అమితాబ్.. ఏంటీ షాక్!: ఇలా మారిపోయారా?.. ఇంతలోనే మరో ట్విస్ట్..

అమితాబ్.. ఏంటీ షాక్!: ఇలా మారిపోయారా?.. ఇంతలోనే మరో ట్విస్ట్..

Subscribe to Filmibeat Telugu

ఆరాధ్య నటుడి సినిమాకు సంబంధించి ఒక్క ఫోటో బయటకు లీక్ అయిందంటే అభిమానులు పండుగ చేసుకుంటారు. సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ.. ఎవరికి తోచిన రీతిలో వారు గొప్పగా ప్రచారం చేసుకుంటారు. కానీ ఇంతలోనే అది కాస్త ఫేక్ అని తేలిందనుకోండి.. ఉత్సాహం కాస్త ఉసూరుమంటుంది. బిగ్ బీ అభిమానుల పరిస్థితి కూడా ఇప్పుడిలాగే తయారైంది.

ఫోటో లీక్?

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో కలిసి ప్రస్తుతం 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బిగ్ బీ లుక్ ఇదేనంటూ తాజాగా ఓ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వారెవ్వా అమితాబ్ లుక్ అదిరిపోయిదంటూ అభిమానులు కుప్పలు తెప్పలుగా షేర్ చేస్తూ పోయారు. కానీ అసలు విషయం తెలిశాక షాక్ తినక తప్పలేదు.

ఇదీ ట్విస్ట్:

భారీ తలపాగాతో.. ముడుతలు పట్టి, పాలిపోయిన చర్మంతో.. ఒక కన్నుమూసుకుపోయి.. ఓ కురు వృద్ధుడి గెటప్‌లో అమితాబ్ అందులో కనిపిస్తున్నారు. అయితే ఆ స్టిల్ నిజంగా అమితాబ్‌దేనా ఆరా తీస్తే.. కంగు తినక తప్పలేదు. అసలు ఆ ఫోటో అమితాబ్ దే కాదని, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాకు దానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది.

 ఆఫ్ఘన్ శరణార్థి ఫోటో..:

ఆఫ్ఘన్ శరణార్థి ఫోటో..:

అమితాబ్ న్యూ లుక్ అంటూ వైరల్ అయిన ఆ ఫోటో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఓ శరణార్థిగా గుర్తించారు. ఫోటోగ్రాఫర్ స్టీవ్ మెక్ కర్రీ గతేడాది ఆ ఫోటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'షాబూజ్(68) ఫోటోగ్రాఫ్ నేనే తీశాను. ఇతను పాకిస్తాన్ లోని ఆఫ్ఘన్ శరణార్థి. ఆఫ్ఘనిస్తాన్‌లో చాలామంది ఒకే పేరును పెట్టుకుంటారు' అంటూ ఆ ఫోటోకు కాస్త వివరణ కూడా ఇచ్చాడు.

గుడ్డిగా నమ్మేశారు..:

గుడ్డిగా నమ్మేశారు..:

మెక్ కర్రీ తీసిన షాబూజ్ ఫోటోకు అమితాబ్ లుక్స్‌తో కాస్త దగ్గరి పోలికలు ఉండటంతో.. చాలామంది నెటిజెన్స్ అది బిగ్ బీదే అని పొరబడ్డారు. అందుకే క్షణాల్లో ఆ ఫోటో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. మరోవైపు 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' యూనిట్ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. చాలామంది ఆ ఫోటో అమితాబ్ దే అని గుడ్డిగా నమ్మేశారు.

కోలుకుంటున్న బిగ్ బీ..:

కోలుకుంటున్న బిగ్ బీ..:

ఇక ఇదే చిత్రం షూటింగ్ సందర్భంగా అమితాబ్ బచ్చన్ కాస్త అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని అమితాబ్ భార్య జయాబచ్చన్ తెలిపారు. 'బిగ్ బీ బాగున్నారు. అయితే ఆయన నడుము, మెడ నొప్పితో బాధపడుతున్నారు. షూటింగ్‌లో ఆయన ధరించిన కాస్ట్యూమ్స్ చాలా బరువైనవి కావడంతోనే ఈ సమస్య తలెత్తింది' అని ఆమె మీడియాతో తెలిపారు.

జోద్‌పూర్ షూటింగ్:

జోద్‌పూర్ షూటింగ్:

థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ షూటింగ్ కోసం ఈ నెల ఆరంభంలోనే రాజస్తాన్ లోని జోద్‌పూర్ వెళ్లారు అమితాబ్. అక్కడ కత్రినా కైఫ్, అమీర్ ఖాన్, ఫాతిమా సానా షేక్ లతో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్నారు. ఈ దర్శకుడు గతంలో అమీర్-కత్రినా జోడీగా ధూమ్-3ని తెరకెక్కించారు.

English summary
Amitabh Bachchan's Thugs Of Hindostan look revealed? - No, not yet. The 75-year-old actor is currently shooting for the Yash Raj Films financed project in Jodhpur and on Tuesday evening a picture,
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu