»   » శ్రీదేవి కోసం అనిల్ కపూర్ అప్పట్లో పెద్ద రిస్క్ తీసుకున్నాడు: అందుకే అపుడు కలిసి....

శ్రీదేవి కోసం అనిల్ కపూర్ అప్పట్లో పెద్ద రిస్క్ తీసుకున్నాడు: అందుకే అపుడు కలిసి....

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  నాలుగేళ్ల వయసులోనే నటించడం మొదలు పెట్టిన శ్రీదేవి క్రమ క్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. 4 దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. అప్పట్లో శ్రీదేవితో కలిసి నటించడం అనేది ప్రతి యాక్టర్ డ్రీమ్. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, శ్రీదేవి కలిసి తొలిసారి 'మిస్టర్ ఇండియా'లో కలిసి నటించిన సంగతి తెసిందే. ఈ సినిమాకు సైన్ చేసిన ఆయన అప్పట్లో పెద్ద రిస్క్ తీసుకున్నారు.

   అనిల్ కపూర్ ఏం చెప్పారంటే

  అనిల్ కపూర్ ఏం చెప్పారంటే

  గతంలో జరిగిన 17వ మియామి ఫిల్మ్ ఫెస్టివల్‌ ప్రెస్ కాన్ఫరెన్సులో అనిల్ కపూర్‌ మాట్లాడుతూ.... ‘మిస్టర్ ఇండియా' సినిమాకు సైన్ చేయడానికి కేవలం శ్రీదేవి కారణమని తెలిపారు. ఆ స్క్రిప్టు తనకు అంతగా నచ్చకపోయినా కేవలం శ్రీదేవి ఈ చిత్రంలో నటిస్తుందనే ఒకే ఒక కారణంతో రిస్క్ చేసినట్లు వెల్లడించారు.

   ఆ సమయంలో శ్రీదేవి పెద్ద స్టార్

  ఆ సమయంలో శ్రీదేవి పెద్ద స్టార్

  ఒక నటుడి కెరీర్ మీద జయాపజయాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఏదైనా తేడా వచ్చి సినిమా పోతే కెరీర్ స్పాయిల్ అవుతుంది. కానీ ఆ సమయంలో శ్రీదేవి ఇండియాలోనే పెద్ద సూపర్ స్టార్. ఆమెతో కలిసి నటిస్తే తన స్థాయి కూడా పెరుగుతుందనే ఒకే ఒక నమ్మకంతో రిస్క్ తీసుకున్నట్లు అనిల్ కపూర్ తెలిపారు.

  Arjun Kapoor about Sridevi అర్జున్ కపూర్ మనసులో ఎంత ప్రేమ దాచుకున్నాడో!
   శ్రీదేవి ఫేవరెట్ కోస్టార్ ఎవరంటే...

  శ్రీదేవి ఫేవరెట్ కోస్టార్ ఎవరంటే...

  స్టార్ డస్ట్ ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు? అనే ప్రశ్నకు శ్రీదేవి స్పందిస్తూ.... ‘అందరూ' అంటూ సమాధానం ఇచ్చారు. ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలని కోరగా ‘అనిల్ కపూర్' అని రిప్లై ఇచ్చారు.

   అందుకే అనిల్ కపూర్ అంటే ఇష్టం

  అందుకే అనిల్ కపూర్ అంటే ఇష్టం

  అనిల్ కపూర్ అంటే ఎందుకు ఇష్టం అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ...... అతడు చాలా బాగా మాట్లాడతాడు, ఆసక్తికర విషయాలు పంచుకుంటాడు అని శ్రీదేవి వెల్లడించారు.

  ఇపుడు జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి

  ఇపుడు జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి

  ఇప్పుడు శీదేవి మన మధ్య లేరు. ఆమె జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లో ఆమె బాత్ టబ్ లో పడి మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె మరణం వెనక అసలు వాస్తవం ఏమిటనేది ఇప్పటికీ ఈ ప్రపంచానికి తెలియలేదు.

   సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో

  సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో

  శ్రీదేవి మరణంపై సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. దుబాయ్ పోలీసులు ఆమె మరణాన్ని ప్రమాద వశాత్తు జారి పడిపోవడం వల్ల సంభవించిన మరణం అని తేల్చారు. అయితే శ్రీదేవి మరణం ముందు, వెనక జరిగిన పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

   దేశం మొత్తం విషాదంలో

  దేశం మొత్తం విషాదంలో

  ఇండియన్ సినిమా పరిశ్రమ భాషా ప్రాతిపదికన, ప్రాంతాల వారికిగా వేర్వేరుగా ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైనా చనిపోతే ఆయా ప్రాంతాల్లో మాత్రమే విషాదం ఉంటుంది. అయితే శ్రీదేవి అన్ని బాషాల్లోనూ నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

  English summary
  Sridevi was the biggest female Superstar India had ever seen. She had started working at the tender age of four. In her career span of over four decades, Sridevi received a number of awards and honours. It was every actor's dream to share screen with her. Anil Kapoor too had mentioned at 17th MAMI Film Festival press conference that Sridevi was the reason why he signed Mr India.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more