twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యామిలీ కోసం వాచ్‌మెన్‌గా మారిన బాలీవుడ్ నటుడు.. అవకాశాలు ఇవ్వలేం అంటున్న డైరెక్టర్!

    |

    Recommended Video

    Famous Bollywood Actor Working As A Watchman | Filmibeat Telugu

    చిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు కిందిస్థాయి నుంచి ఎదిగిన వారే. ఎంతో కష్టపడి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని రాణించిన వారు చాలా మందే ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ ప్రతిభతో స్టార్స్ గా ఎదిగినవారు ఉన్నారు. ఈ క్రమంలో కొంత అదృష్టం కూడా కలసి రావాలి. కొందరు నటులకు ఆరంభంలో అవకాశాలు దక్కినా ఆ తర్వాత విజయాలు లేక కెరీర్ పూర్తిగా పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. గతంలో ప్రముఖ నటుడిగా బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సవి సిద్దూ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కొత్త అవతారం ఎత్తాడు. అతడు ఎంచుకునే వృత్తిపట్ల ప్రశంసలు దక్కుతున్నాయి.

    పోలీస్ ఆఫీసర్

    పోలీస్ ఆఫీసర్

    సవి సిద్దూ పలు బాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలో నటించాడు. 2011లో వచ్చిన అక్షయ్ కుమార్ చిత్రం పతియాల హౌస్ లో సవి సిద్దూ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఆ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. గులాల్, బేవకూఫియాన్ లాంటి చిత్రాల్లో కూడా సిద్దూ నటించాడు. కానీ ఇటీవల సిద్దూకు అవకాశాలు రావడం లేదు. దీనితో కుటుంబ పోషణ భారంగా మారింది. తాజాగా సిద్దూ తన ఫ్యామిలీ కోసం కొత్త వృత్తిని ఎంచుకున్నాడు.

    సోషల్ మీడియాలో వైరల్

    సోషల్ మీడియాలో వైరల్

    సిద్దూ ఎంచుకున్న వృత్తి వాచ్‌మెన్‌ ఉద్యోగం. తాను నటుడిని కదా.. వాచ్‌మెన్‌గా పనిచేయడం ఏంటని చిన్నతనంగా ఫీల్ అవలేదు. గౌరవంగా చేసే ఉద్యోగం ఏదైనా మంచిదే అనిపించి కుటుంబం కోసం వాచ్‌మెన్‌గా మారాడు. సిద్దూ వాచ్‌మెన్‌గా జాబ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అతడిని ప్రశంసిస్తూ పలువురు దర్శక నిర్మాతలకు మెసేజ్ లు పెడుతున్నారు. సిద్దూకు చిత్రాల్లో అవకాశం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

    అవకాశాలు ఇవ్వలేం

    అవకాశాలు ఇవ్వలేం

    తన కుటుంబం కోసం సిద్దూ వాచ్‌మెన్‌ ఉద్యోగం ఎంచుకున్నారు. దీనితో ఆయన పట్ల నాకు మరింత గౌరవం పెరిగింది. చాలా మంది నటులు అవకాశాలు లేకపోతే తాగుబోతులుగా మారుతారు. కానీ సిద్దూ అలా చేయలేదు అని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఆయనకు అవకాశాలు ఇవ్వాలనే నెటిజన్ల డిమాండ్ కు స్పందిస్తూ.. చిత్ర పరిశ్రమలో జాలిపడి అవకాశాలు ఇవ్వ కూడదు అని అన్నారు.

    సాయం చేయాలనుకుంటే

    సాయం చేయాలనుకుంటే

    నా చిత్రాల్లో సిద్దూకి మూడుసార్లు అవకాశం ఇచ్చానని అనురాగ్ అన్నారు. మీకు ఏదైనా సాయం చేయాలనుకుంటే సిద్దూ నటించిన చిత్రాలని టికెట్ కొనుక్కుని థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి. తద్వారా అందులో నటించిన నటీనటులందరికి గుర్తింపు పెరుగుతుంది. వారికి మరిన్ని అవకాశాలు వస్తాయి. నటులకు సాయం చేసే విధానం ఇది అని అనురాగ్ అన్నారు. ఆయన పడుతున్న కష్టాన్ని సోషల్ మీడియాలో వివరించడం సరైనది కాదని అన్నారు. సిద్దూ గౌరవంగా వాచ్‌మెన్‌ ఉద్యోగం చేస్తున్నారు. అది చిన్నది కాదు.. అలాగని పెద్దదీ కాదని అభిప్రాయపడ్డారు.

    English summary
    Director Anurag Kashyap has opened up on Gulaal actor Savi Siddhu working as a watchman to support himself
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X