For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బికినీలో కనిపిస్తే ఒక్క రాత్రికి నీ రేటెంత అంటున్నారు.. స్టార్ డైరెక్టర్ కూతురి ఆవేదన

  |

  సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై ట్రోలింగ్స్ రావడం సర్వసాధారణంగా మారింది. ఏ మాత్రం అతి చేసినా కూడా హేళనకు గురవ్వడం కామన్ అయిపోయింది. అయితే కొన్నిసార్లు ట్రోలింగ్స్ అనేవి హద్దులు దాటుతున్నాయి. బెదిరింపులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. ఇటీవల సీనియర్ రైటర్ అండ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు కూడా ఒక ఫొటో పోస్ట్ చేసినందుకు అసభ్యకరమైన కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందట. తనను ఆ మాటలు చాలా బాధకు గురి చేశాయని ఆమె యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా చెప్పింది.

  హీరోయిన్స్ కంటే భారీగా ఫాలోవర్స్

  హీరోయిన్స్ కంటే భారీగా ఫాలోవర్స్

  బాలీవుడ్ చిత్రనిర్మాత నటుడు దర్శకుడు రచయిత అనురాగ్ కశ్యప్, అతని మాజీ భార్య, ఫిల్మ్ ఎడిటర్ ఆర్తి బజాజ్ కుమార్తె ఆలియా కశ్యప్ సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అమెరికాలో ఉండి చదువుకుంటున్న ఆమె నేటితరం మోడల్స్ కంటే కూడా గ్లామరస్ ఫొటోలతో ఇన్స్టాగ్రామ్ ను హీటెక్కిస్తుంది. ఇక రెగ్యులర్ గా ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోలను టిక్ టాక్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

  బాయ్ ఫ్రెండ్ గురించి కూడా చెప్పేసింది

  బాయ్ ఫ్రెండ్ గురించి కూడా చెప్పేసింది

  ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌లో కొత్త వీడియోను కూడా పోస్ట్ చేసింది. దీనిలో ఆమె తన ప్రియుడు షేన్ గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
  ఆలియా, ఆమె ప్రియుడు షేన్ గ్రెగోయిర్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మొత్తం వారి ప్రేమతో నిండిపోయిందని వారి ఫొటోలను చూస్తేనే అర్ధమవుతుంది. వారి లవ్ డోస్ మామూలుగా లేదని క్లారిటీ అయితే వచ్చేసింది.

  అలాంటి మాటలు తట్టుకోలేకపోతున్నా

  అలాంటి మాటలు తట్టుకోలేకపోతున్నా


  బికినీ ఫొటోలను పోస్ట్ చేసినందుకు ఆమె ఎదుర్కొన్న ట్రోలింగ్స్ పై అలాగే అసహ్యమైన కామెంట్స్ పై ఎంతగానో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆలియా మాట్లాడుతూ.. నేను చాలా సున్నితమైన వ్యక్తిని. అతి చిన్న ద్వేషం కూడా నన్ను ప్రభావితం చేస్తుంది. చిన్న కామెంట్ చేసినా కూడా నేను తట్టుకోలేను. లో దుస్తుల్లో కనిపించినందుకు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారో నాకు అర్థం కావడం.. లేదని తెలిపింది.

  వేశ్య అని పిలుస్తున్నారు

  వేశ్య అని పిలుస్తున్నారు

  నేను కేవలం ఇండియన్ కావడం వలన అలాంటి పోస్ట్ లు చేయడం పట్ల సిగ్గుపడాలని నాకు చెప్తున్నారు. కొందరు నన్ను రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు. వేశ్య అని పిలుస్తున్నారు. ఒక్క రాత్రికి మీ రేటు ఎంత అంటూ అసహ్యంగా మాట్లాడడమే కాకుండా చంపేస్తామని కూడా అంటున్నారు. నా కుటుంబంపై కూడా తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి సందేశాలు నాకు ఎన్నో వచ్చాయి. అని ఆలియా తెలిపారు.

  సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదు

  సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదు

  ఇక ఆలియా సినిమా ఇండస్ట్రీలోకి రానుందని తండ్రి దర్శకత్వంలోనే ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు రూమర్స్ రాగా అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపింది. చిత్ర పరిశ్రమలో చేరే ఆలోచన లేదని చెబుతూ.. నాన్న చేసే సినిమాలు చాలా కమర్షియల్ కాదు. నేను స్పష్టంగా నా తల్లిదండ్రులను చూస్తూ పెరిగాను. బాలీవుడ్ ఇండస్ట్రీ అనేది నాకు మామూలే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ వాతావరణాన్ని చూస్తూనే పెరిగాను. కాబట్టి, 'ఓహ్ మై గాడ్, ఇట్స్ బాలీవుడ్' అనేంతలా కాదు. నేను సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదని ఆలియా వివరణ ఇచ్చింది.

  English summary
  Trollings on celebrities have become all too common on social media. It has become common to be ridiculed no matter how much you do. But sometimes trollings are crossing boundaries. He says he is also facing threats. Recently the daughter of senior writer and director Anurag Kashyap also had to face obscene comments for posting a photo. She said through her YouTube channel that she was very upset by those words.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X