twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భార్యతో విడాకులు, అప్పుల పాలైన హీరో...

    |

    బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కోటి రూపాయల అప్పు ఎగ్గొట్టడంతో లీగల్ కేసులు చుట్టుముట్టాయి. ముంబై మీడియా కథనాల ప్రకారం 2018 మేలో అర్జున్ రాంపాల్ వైటి ఎంటర్టెన్మెంట్స్ వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నారని, సమయానికి చెల్లించక పోవడంతో వారు బాంబే హైకోర్టులో దావా వేసినట్లు తెలుస్తోంది.

    అయితే అర్జున్ రాంపాల్ మాత్రం వారితో మ్యాటర్ క్లియర్ అయిందని, డబ్బు కొంత చెల్లించినట్లు, మిగతాది త్వరలో చెల్లిస్తానని చెబుతున్నారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    మూడు నెలల్లో తిరిగి ఇస్తానని

    మూడు నెలల్లో తిరిగి ఇస్తానని

    వైటి ఎంటర్టెన్మెంట్స్ వద్ద రూ. 1 కోటి అప్పుగా తీసుకున్న అర్జున్ రాంపాల్ 12% వడ్డీతో మూడు నెలల్లో తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు. ఈ మేరకు 1 కోటి పోస్ట్ డేటెడ్ చెక్ సైతం ఇచ్చారు. ఆగస్టు 23న చెక్ బ్యాంకులో వేయగా అతడి అకౌంట్లో డబ్బలేక అది బౌన్స్ అయింది. దీంతో వైటి ఎంటర్టెన్మెంట్స్ వారు అక్టోబర్‌లో అతడిపై క్రిమినల్ కేసు పెట్టారు.

    వడ్డీ చెల్లించాడు.. అసలు అలాగే

    వడ్డీ చెల్లించాడు.. అసలు అలాగే

    అక్టోబర్ 8న ఈ కేసులో నోటీసులు జారీ అవ్వగా.. తనకు మరో 14 రోజుల సమయం కావాలని కోరాడు. అయితే ఆ సమయానికి కూడా అర్జున్ రాంపాల్ డబ్బు చెల్లించడంలో విఫలమయ్యారట. తర్వాత నవంబర్ 22న రూ. 7.5 లక్షలు చెల్లించారని, ఇంకా 1 కోటి 50వేలు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. మిగతా డబ్బు చెల్లించకుండా ఆలస్యం చేస్తుండటంతో వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

    భార్యతో విడాకులు

    భార్యతో విడాకులు

    అర్జున్ రాంపాల్, ఆయన భార్య మెహర్‌ జెసియా తమ 20 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుంటూ 2018లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అర్జున్ రాంపాల్ ఇలా అప్పులపాలు కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.

    సినిమా అవకాశాలు అంతంత మాత్రమే

    సినిమా అవకాశాలు అంతంత మాత్రమే

    అర్జున్ రాంపాల్ సినిమా కెరీర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. 2018లో విడుదలైన ‘పల్టాన్'మూవీ బాక్సాఫీసు వద్ద ప్లాప్ అయింది. ఆ తర్వాత ‘నాస్టిక్' అనే మరో చిత్రం మొదలైనా ఆర్థిక ఇబ్బందులతో అది ముందుకు సాగడం లేదు.

    English summary
    According to a report in a daily, Bollywood Actor Arjun Rampal has been sued by YT Entertainment for not paying back a Rs 1 crore loan to the company.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X