twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aryan Khan ఆ హీరోయిన్‌ను అడ్డుపెట్టుకొని షారుక్‌పై ఎన్సీబీ ప్రతీకారం.. శివసేన ఫైర్.. బీజేపీ ఘాటుగా కౌంటర్

    |

    డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఆర్యన్ ఖాన్ వ్యవహారం ప్రస్తుతం బీజేపీ, శివసేన మధ్య భారీ వాగ్వాగాదానికి దారి తీసేలా కనిపిస్తున్నది. గత 17 రోజులుగా జుడిషియల్ కస్టడీలో ఆర్యన్ ఖాన్‌ను పెట్టడంపై శివసేన భగ్గుమన్నది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్, కస్డడీలో పెట్టడంపై నార్గోటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్సీబీ) ఆరోపణలు సంధిస్తూ శివసేన నేత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

    ఆ హీరోయిన్ కారణంగానే టార్గెట్

    ఆ హీరోయిన్ కారణంగానే టార్గెట్


    బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికే ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే సినీ పరిశ్రమపై పగ, ప్రతీకారాలకు పాల్పడుతున్నారు. తన భార్య క్రాంతి రేద్కర్ సినిమా పరిశ్రమలో రాణించలేకపోయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్‌ను ఆయన టార్గెట్ చేస్తున్నాడు అంటూ సుప్రీంకోర్టులో శివసేన నేత కిశోర్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. సమీర్ వాంఖడే భార్య మరాఠీ నటి క్రాంతి రేద్కర్‌ అనే విషయం విదితమే.

    సుప్రీం కోర్టు సుమోటోగా

    సుప్రీం కోర్టు సుమోటోగా

    ఆర్యన్ ఖాన్ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నది. కాబట్టి ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకోవాలి. ఆర్యన్ ఖాన్ ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా అత్యున్నత న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలి. అక్టోబర్ 2వ తేదీన ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌లో పార్టీ జరుగుతుండగా ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

    సినీ తారలు, మోడల్స్‌పై ప్రతీకారం

    సినీ తారలు, మోడల్స్‌పై ప్రతీకారం

    ముంబై ఎన్సీబీ తమ వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సినీ ప్రముఖులను, కొందరు మోడల్స్‌ను టార్గెట్ చేస్తున్నది. గత రెండేళ్లుగా అక్రమ కేసులు బనాయిస్తూ అనైతిక చర్యలకు ఎన్సీబీ అధికారులు పాల్పడుతున్నారు. ఈ కేసులో అనైతిక విషయాలను బయటపెట్టడానికి స్రత్యేకమైన న్యాయపరమైన విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయండి. ఎన్సీబీ అధికారి భర్తగా ఉండటంతో ఒ నటి తనకు పోటీగా ఉన్న సెలబ్రిటీలను, మోడల్స్‌ను ఎన్డీపీఎస్ యాక్ట్‌తో వేధిస్తున్నది అంటూ పిటిషన్‌లో శివసన నేత కిశోర్ తివారీ పేర్కొన్నారు.

    డ్రగ్స్ మాఫియాకు శివసేన మద్దతా?

    డ్రగ్స్ మాఫియాకు శివసేన మద్దతా?

    శివసేన ఆరోపణలపై బీజేపీ మహారాష్ట్ర అధికార ప్రతినిధి రామ్ కదమ్ ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ మాఫియాను మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తున్నదో, ఎందుకు మద్దతు తెలియజేస్తున్నదో అర్ధం కావడం లేదు అని అన్నారు. మాకు ఆర్యన్ ఖాన్ గానీ, మరే ఇతర సెలబ్రిటీపై మాకు ఎలాంటి వ్యక్తిగత శతృత్వం లేదు. ఎన్సీబీని టార్గెట్ చేస్తూ.. మాఫియాకు మద్దతు పలుకుతున్న శివసేనకు వారితో ఏదైనా లింక్ ఉందా అంటూ ప్రశ్నించారు. శివసేనకు మాఫియా, సెలబ్రిటీల నుంచి డబ్బు మూటలు అందుతున్నాయా? రామ్ కదమ్ ప్రశ్నించారు.

    సినీ తారలు తప్ప మరొకరు లేరా? ఉద్దవ్ థాక్రే

    సినీ తారలు తప్ప మరొకరు లేరా? ఉద్దవ్ థాక్రే

    ఇదిలా ఉండగా, ముంబైలో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న ఎన్సీబీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. సినీ ప్రముఖులు తప్ప ఎన్సీబీకి మరోకరు డ్రగ్స్ తీసుకొంటున్నట్టు కనిపించడం లేదు అని ఉద్దవ్ థాక్ర్ ఆరోపించారు. ఇక అర్యన్ ఖాన్ విషయానికి వస్తే.. అక్టోబర్ 20వ తేదీన బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారించనున్నది. ఇప్పటికే 4 సార్లు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

    English summary
    Aryan Khan drug case: Shiva Sena drags NCB's Sameer Wankhede's wife Kranti Redkar into Drug case. Shiva Sena leader files a petition in Supreme Court.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X