Aryan Khan డ్రగ్స్ కేసులో యువ హీరోయిన్ పేరు తెరపైకి.. బెయిల్ విచారణ ముందు షారుక్‌కు మరో షాక్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు అర్యన్ ఖాన్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ ముంబై కోర్టులో జరుగనున్నది. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌లో జరుగుతున్న పార్టీ సందర్భంగా అర్యన్ ఖాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి న సీరియల్ నంబర్ 22 కావడంతో పిటిషన్‌ను రెండు గంటల ప్రాంతంలో విచారించనున్నారు.

అయితే ఇప్పటికే ఎన్సీబీ తరపు లాయర్లు, ఆర్యన్ ఖాన్ తరుఫున సీనియర్ లాయర్ అమిత్ దేశాయ్ కోర్టులో హాజరయ్యారు. ఈ బెయిల్ పిటిషన్‌ను ఎన్‌డీపీఎస్ కోర్టు న్యాయమూర్తి వీవీ పాటిల్ విచారించనున్నారు. ఈ విచారణకు ముందు హీరోయిన్‌తో ఆర్యన్ ఖాన్ జరిపిన ఛాటింగ్‌ను తెరపైకి తేవడంతో షారుక్ ఖాన్ కుటుంబాన్ని షాక్ గురిచేస్తున్నది. ఈ వివరాల్లోకి వెళితే..

డ్రగ్స్ సప్లయర్లతో నేరుగా సంబంధాలు

డ్రగ్స్ సప్లయర్లతో నేరుగా సంబంధాలు

గత విచారణ సందర్భంగా ఆర్యన్ ఖాన్‌పై ఎన్సీబీ అధికారులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్యన్ ఖాన్ రెగ్యులర్‌గా డ్రగ్స్ తీసుకొనే వాడు. డ్రగ్స్ సప్లయర్లతో ఆయనకు నేరుగా సంబంధాలు ఉన్నాయి. అరెస్ట్ సమయంలో అతడి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదు. కానీ డ్రగ్స్ సప్లయర్లతో మాత్రం సంబంధాలు ఉన్నాయనేవ విషయం వాట్సాప్ ఛాటింగ్‌లో స్పష్టమైంది అని ఎన్సీబీ కోర్టుకు విన్నవించింది.

విదేశాంగ శాఖను సంప్రదించిన ఎన్సీబీ

విదేశాంగ శాఖను సంప్రదించిన ఎన్సీబీ

ఆర్యన్ ఖాన్‌కు విదేశీ డ్రగ్స్ సప్లయర్లతో, డ్రగ్ రాకెట్‌తో కాంటాక్ట్ ఉంది. ఆ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ గురించి ఆరా తీయాలని విదేశాంగ శాఖను కోరాం. ఆ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం అని అధికారులు స్పషం చేశారు. అధికారులు వాదనలు విన్న తర్వాత కోర్టు స్పందిస్తూ.. ఆర్యన్ ఖాన్‌ వద్ద డ్రగ్స్ లభ్యం కానప్పటికి.. ఇంటర్నెషనల్ డ్రగ్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయని తేలితే బెయిల్ ఇచ్చేది లేదని కోర్టు స్పష్టం చేసింది.

సినీ నిర్మాతను విచారిస్తున్న ఖత్రీ

సినీ నిర్మాతను విచారిస్తున్న ఖత్రీ

ముంబై గోవా క్రూయిజ్‌లో జరిగిన పార్టీకి సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత ఇంతియాజ్ ఖత్రీని అధికారులు విచారిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఇప్పటికీ మూడుసార్లు సమన్లు జారీ చేసి ప్రశ్నించారు. ఇటీవల బాంద్రాలోని ఖత్రీ ఇంటిపై మెరుపుదాడుల చేయడం సంచలనం రేపింది.

బాలీవుడ్ హీరోయిన్ పేరు తెరపైకి

బాలీవుడ్ హీరోయిన్ పేరు తెరపైకి

ఆర్యన్ ఖాన్‌కు మొబైల్ ఫోన్‌లో లభ్యమైన వాట్సప్ ఛాట్స్‌ను ఎన్సీబీ అధికారులు కోర్టుకు అందజేశారు. క్రూయిజ్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో బాలీవుడ్ హీరోయిన్‌తో డ్రగ్స్ గురించి ఛాటింగ్ చేసిన విషయాలను కోర్టుకు అందించేయడం జరిగింది. ఈ క్రమంలోనే డ్రగ్స్ సప్లయర్లతో జరిపిన చాటింగ్‌ను న్యాయమూర్తికి అందజేయడంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారిందనే వాదన తెరపైకి వచ్చింది.

ఆర్యన్ ఖాన్‌కు జైలులో కౌన్సిలింగ్

ఆర్యన్ ఖాన్‌కు జైలులో కౌన్సిలింగ్

ఇదిలా ఉండగా, డ్రగ్ పార్టీ సమయంలో ఆర్యన్ ఖాన్‌తోపాటు అరెస్ట్ అయిన ఏడుగురు సభ్యులు ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. ఇందులో ఇద్దరు యువతులు కూడా ఉండటం గమనార్హం. వీరిందరికి జైలులో కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. డ్రగ్స్ వినియోగించడంపై ఆర్యన్ ఖాన్ ప్రాయశ్చిత్తం చెందుతున్నారని, ఈ కేసులో బెయిల్ లభిస్తే.. పేదలకు సేవ చేస్తానని, అలాగే తనను తాను మార్చుకొంటానని ఆర్యన్ చెప్పినట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X