For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Who is Shah Rukh Khan: రిలీజ్ ముందు పఠాన్‌కు షాక్.. షారూఖ్ ఎవరో తెలీదు.. సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

  |

  బాలీవుడ్ నుంచి చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే హైలైట్ అవుతుంటాయి. వాటిలో కూడా కొన్ని సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. అలాంటి సినిమానే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్'. కొద్ది రోజుల్లో రాబోతున్న ఈ మూవీకి వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే తాజాగా షారూఖ్‌తో పాటు ఈ సినిమాపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  పఠాన్‌గా రాబోతున్న షారూఖ్

  పఠాన్‌గా రాబోతున్న షారూఖ్


  సుదీర్ఘ కాలం పాటు గ్యాప్ తీసుకున్న షారూఖ్ ఖాన్ ఇప్పుడు 'పఠాన్' అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. విశాల్ శేఖర్ సంగీతం అందించాడు.

  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న కేతిక శర్మ హాట్ వీడియో: ముద్దులు పెట్టి.. ఎదపై హత్తుకుని!

  అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు

  అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు


  ఒకవైపు వరుస వివాదాలను ఎదుర్కొంటోన్నా.. 'పఠాన్' మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో అవుతోన్నాయి. ఇలా ఇప్పటికే ఈ సినిమా కొన్ని కోట్ల రూపాలయను వసూలు చేసింది. తద్వారా రిలీజ్ ముందే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.

  ప్రముఖులూ వ్యతిరేకిస్తూనే

  ప్రముఖులూ వ్యతిరేకిస్తూనే


  షారూఖ్ ఖాన్ 'పఠాన్' మూవీ విడుదలకు సమయం ఆసన్నం అవుతోన్న నేపథ్యంలోనూ.. దీనిపై వివాదం అంతకంతకూ చెలరేగుతూనే ఉంది. ఈ చిత్రం విడుదలను అడ్డకునే దిశగా పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం కామెంట్లు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై నిషేధం విధించాల‌ని ఇటీవలే మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి న‌రోత్తం మిశ్రా కూడా డిమాండ్ చేశారు.

  శృతి మించిన హీరోయిన్ హాట్ షో: బట్టలున్నా లేనట్లే.. మొత్తం కనిపించేలా!

  అస్సాంలో ఉద్రిక్త పరిస్థితి

  అస్సాంలో ఉద్రిక్త పరిస్థితి


  షారూఖ్ నటించిన 'పఠాన్' మూవీ విడుదల సందర్భంగా అస్సాంలోని నారేంగి థియేటర్‌లో దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. భజరంగ్‌దళ్ కార్యకర్తలు అక్కడికి వెళ్లి గొడవ చేశారు. థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్స్‌, కటౌట్లను ధ్వంసం చేశారు. దీంతో షారూఖ్ ఫ్యాన్స్ వాళ్లతో గొడవకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  షారూఖ్ ఎవర అన్న సీఎం

  షారూఖ్ ఎవర అన్న సీఎం


  'పఠాన్' మూవీ వల్ల అస్సాంలో నెలకొన్న పరిస్థితలకు సంబంధించి తాజాగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో 'షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీని రాష్ట్రంలో విడుదల చేస్తారా? నిషేదిస్తారా' అని మీడియా ప్రతినిధులు ఆయనను కోరగా 'అసలు షారూఖ్ ఖాన్ ఎవరు' అని ప్రశ్నించి అందరికీ షాకిచ్చారు.

  హాట్ షోతో ఫిదా చేస్తోన్న ఆదా శర్మ: ఒంటి మీద బట్టలు నిలవట్లేదుగా!

  ఫోన్ చేస్తే ట్రై చేస్తానంటూ

  ఫోన్ చేస్తే ట్రై చేస్తానంటూ


  ఆ తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. 'బాలీవుడ్ స్టార్ అయినా నాకు షారూక్ ఎవరో తెలీదు. ఎందుకంటే నాకు ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్ చేసి సమస్యలు చెబుతుంటారు. కానీ, ఈయన ఎప్పుడూ చేయలేదు. ఒకవేళ ఫోన్ చేస్తే అప్పుడు అతడి గురించి తెలుసుకునేందుకు ట్రై చేస్తాను' అంటూ చెప్పుకొచ్చారు.

  మన సినిమాను చూడండి

  మన సినిమాను చూడండి


  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కొనసాగిస్తూ.. 'బాలీవుడ్ సినిమాల రిలీజ్ గురించి అస్సాం ప్రజలు ఆందోళన చెందడం ఏంటి? మన సినిమా 'డాక్టర్‌ బెజ్బరువా 2' త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఆ సినిమాను మాత్రం అందరూ చూసి విజయవంతం చేయండి' అని చెప్పారు. అయితే, అస్సాంలో 'పఠాన్' మూవీని నిషేదించే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

  English summary
  Shah Rukh Khan Doing Pathaan Movie Under Siddharth Anand Direction. Recently Assam CM Himanta Biswa Sarma Controversial Comments on This Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X