For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న బాలు మున్నంగి.. రణ్‌వీర్, ఆలియా, కరణ్ జోహర్‌తో హైదరాబాదీ..

  |

  హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు బాలు మున్నంగి బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ఆస్ట్రాలజీలో తనకంటూ ప్రతిభను చాటుకొంటూ టాప్ హీరో, హీరోయిన్లను తనకు అభిమానులుగా మార్చుకొంటున్నారు. బాలీవుడ్‌లోని కరణ్ జోహార్ నుంచి బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రతీ ఒక్కరు బాలు మున్నంగిని అమితంగా ఆరాధిస్తుంటారు. అతడు ఇచ్చే సలహాలు, సూచనలను తూచ తప్పకుండా పాటిస్తారు.

  బాలీవుడ్ సినిమా ప్రారంభోత్సవాలు, పనులకు ఆయన చేత ముహూర్తాలు పెట్టించుకుని ముందడుగు వేస్తారు. అజయ్ దేవగణ్ 'తనాజీ' చిత్రానికి బాలు మున్నంగి పెట్టిన ముహూర్తాలను ఫాలో అయ్యారు. అలాగే, 'మే డే'కి కూడా! 'తానాజీ' తర్వాత ప్రభాస్ హీరోగా 'ఆదిపురుష్' చేస్తున్న దర్శకుడు ఓం రౌత్ సైతం, బాలు మున్నంగిని ఫాలో అవుతున్నారు.

  Astrologer Balu Munnangi talk of Bollywood: Alia Bhatt, Ranveer Singh follows

  తాజాగా ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ రాకీ ఆర్ రాణికి ప్రేమ్ కహానీ అనే హిందీ చిత్ర సెట్స్‌లో బాలు మున్నంగి బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, అలియా భట్‌ను కలుసుకొన్నారు. ఈ సందర్భంగా రణ్‌వీర్, ఆలియా, కరణ్ జోహర్‌తో దిగిన ఆయన ఫోటోలు వైరల్‌గా మారాయి.

  ఇక ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమారాలజీలలో ఇరవై మూడేళ్ల సుదీర్ఘ అనుభవమున్న తెలుగువాడు 'బాలు మున్నంగి' కోసం ఇప్పుడు బాలీవుడ్ తారలు, డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన బాలు మున్నంగికి ఇప్పుడు హిందీ చిత్రసీమ నీరాజనాలు పలుకుతున్నది. ఇంకా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, స్వదేశీ, విదేశీ రాజకీయ నేతలు కూడా బాలు మున్నంగి జోస్యాన్ని గట్టిగా నమ్మడం ఆయన ప్రతిభకు అద్దం పడుతున్నది. బాలు చెప్పిన సలహాలు ఫాలో అవడం వల్ల తనకొచ్చిన క్యాన్సర్ కూడా నయమైందని సంజయ్ దత్ చెప్పారు.

  Astrologer Balu Munnangi talk of Bollywood: Alia Bhatt, Ranveer Singh follows

  అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్, లైబీరియా ప్రెసిడెన్షియల్ ప్రతినిధి మెక్ డెల్లా కూపర్ లాంటి విదేశీ రాజకీయ ప్రముఖులు సైతం ఆయనను ఇన్స్‌టాగ్రామ్‌లో ఫాలో అవుతూ... సలహాలు సూచనలు తీసుకోవడం విశేషం.

  బాలు మున్నంగి ఎంతో మంది తెలుగు ప్రముఖులకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా ఎదుగుతున్నారు. తమ రంగాల్లో వృత్తిపరమైన , వ్యక్తిగతమైన సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. వీరిలో ప్రముఖంగా సీనియర్ నటి రమ్యకృష్ణ, సమంత రుత్ ప్రభు, రష్మిక మందన, లావణ్య త్రిపాఠి, నేహా శెట్టి, పూర్ణ, మోనల్ గజ్జర్, కెథరీన్ త్రెసా, ఛార్మీ.... డైరెక్టర్స్ కృష్ణవంశీ, హరీష్ శంకర్ , మెహర్ రమేష్ , పూరీ జగన్నాధ్, వైవీస్ చౌదరి లాంటి ప్రముఖులు బాలు మున్నంగి సూచనలు పాటిస్తారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ , వ్యాపార రంగాల్లో ప్రముఖులు ఆయన సలహాలు తీసుకుంటున్నారు. బాలు మున్నంగి ఇన్స్‌టాగ్రామ్ పేజీ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

  English summary
  Bollywood's go-to astrologer Balu Munnangi has landed on the set of Karan Johar's Rocky Aur Rani Ki Prem Kahani in New Delhi. Considering Munnagi's name figured in the opening credits of KJo's earlier production, Hyderabad-based astro- consultant has a bigger role to play in the romantic comedy starring Ranveer Singh and Alia Bhatt.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X