Just In
- 31 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 52 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 1 hr ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 1 hr ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
Don't Miss!
- Sports
మహ్మద్ సిరాజ్‌కు నాతో చీవాట్లు తినడం ఇష్టం: టీమిండియా బౌలింగ్ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- News
జగ్గంపేటలో ఘోర ప్రమాదం .. మంటల్లో ఇద్దరు సజీవ దహనం , ముగ్గురికి గాయాలు
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరోయిన్ మహీగిల్‌పై దాడి... ఏడుగురు అరెస్ట్.. రంగంలోకి ఏకంగా సీఎం!
బాలీవుడ్ హీరోయిన్ మహీ గిల్, యూనిట్ సభ్యుల దాడి వ్యవహారంలో పోలీసులు చురుకుగా వ్యవహరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో ఈ కేసు పురోగతి సాధిస్తున్నది. ఫిక్సర్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ సందర్భంగా కొందరు గూండాలు, పోలీసుల కలిసి యూనిట్ సభ్యులను చావబాదిన విషయం ఇండస్ట్రీలో సంచలనం రేపింది. నిర్మాత ఏక్తా కపూర్ దాడికి సంబంధించిన వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు..

నిర్మాత సాకేత్ ఫైర్
నిర్మాత సాకేత్ మాట్లాడుతూ.. షూటింగ్‌కు అన్ని రకాలు అనుమతులు ఉన్నా కొందరు సెట్లోకి దూరి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఈ దాడిలో సినిమాటోగ్రాఫర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దర్శకుడికి షోల్డర్ డిస్ లోకేట్ అయ్యింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంగతకులకు స్వయంగా పోలీసులు సహాయం చేయడం, వారిని దాడికి రెచ్చగొట్టడం దారుణ అని తెలిపారు.

పోలీసులే దాడికి ప్రోత్సాహం
ఫిక్సర్ సెట్లో జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని నిర్ణయించుకొన్నాం. ఎందుకంటే పోలీసులు కూడా ఇందులో భాగం కావడంతో న్యాయం జరుగదని భావించాం. మేము కేసు ఫైల్ చేసినా బెయిల్‌పై నిందితులు బయటకు వస్తారు. దాని వల్ల ప్రయోజనం ఉండదు. నేరస్థుల్లా మేము కేవలం కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ దాడి ఘటన కేవలం మాపైనే కాదు.. ఇండస్ట్రీ మొత్తంపైనే అని భావిస్తున్నాం అని అన్నారు.
|
సీఎం స్పందించడంతో అరెస్టులు
థానేలో మహీగిల్‌పై జరిగిన దాడి ఘటనలో ఏడుగురు గుండాలను అరెస్ట్ చేశారు. ఈ ఘటనను మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తీవ్రంగా పరిగణించారు. దాడికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో ఫిక్సర్ యూనిట్ సభ్యులు సీఎంను కలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఫిక్సర్ సినిమా షూట్‌లో జరిగిన ఘటనపై నిర్మాత ఏక్తా కపూర్, దర్శకుడు తిగ్మన్షు ధులియా స్పందించారు. మహిగిల్‌పై దాడి అమానుషం. సినీ తారలపై దాడి చేయడం సరికాదు అని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ఘటన ముంబైలోని మీరా రోడ్డులోని ఘోడ్‌బందర్ రోడ్‌లో చోటుచేసుకొన్నది.