Don't Miss!
- News
YS Jagan : ఢిల్లీ చేరుకున్న జగన్ ! రేపు దౌత్యవేత్తలతో భేటీ- పెట్టుబడుల వేట !
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Lifestyle
Vastu Tips: వ్యాపారంలో లాభాల కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి
- Finance
activa ev: హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్.. ఏ మోడల్, ఎప్పుడొస్తోంది ?
- Sports
INDvsNZ : గిల్ను పక్కన పెట్టేసి.. పృథ్వీ షాను ఆడించాలి!
- Technology
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Deepika Padukone: ఫిఫా వరల్డ్ కప్ లో హైలెట్ గా నిలిచిన దీపిక.. అక్కడికి వెళ్ళడానికి కారణమిదే!
ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఎంతోమంది జనాలు ఎదురు చూశారు. అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగిన ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్లో అర్జెంటీనా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ వరల్డ్ కప్ లో దీపిక పదుకొన్ కూడా ముందిగా హైలెట్ గా నిలవడం విశేషం. ప్రపంచంలో ఎక్కువమంది చూస్తున్న ఆ వరల్డ్ కప్ ఫైనల్ కు ఆమె ఎందుకు వెళ్ళింది? అక్కడ హైలెట్ ఎందుకయ్యింది.. అనే వివరాల్లోకి వెళితే..

బికినీ కాంట్రవర్సీ
గత కొన్ని రోజులుగా దీపిక పదుకొన్ పఠాన్ సినిమాకు సంబంధించిన కాంట్రవర్సీ వార్తల్లో నిలుస్తోంది. అందులో ఆమె ధరించిన బికినీ ఓవర్గం వారి మనోభావాలను దెబ్బతీసింది అని అందుకే వెంటనే ఆ పాటను తొలగించాలి అని లేదంటే పఠాన్ సినిమాలో అడ్డుకుంటాము అని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్రకు చెందిన మంత్రి కూడా ఈ విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఫిఫా ఫైనల్స్ లో దీపిక
అయితే అలా వరుసగా ట్రోలింగ్ ఎదురవుతున్న సమయంలో దీపిక పదుకొనే రేంజ్ ఒక్కసారిగా పెరిగే విధంగా ఫిఫా వరల్డ్ కప్ లో దర్శనం ఇచ్చింది. ఇప్పటివరకు ఇండియన్స్ సెలబ్రిటీలలో ఎవరు కూడా ఆ విధంగా ఫిఫా ఫైనల్స్ లో కనిపించలేదు. కానీ దీపిక పదుకొనే గ్రౌండ్ మధ్యలో నిలబడి ఫైనల్ కప్ ను ఆవిష్కరించడం హైలెట్ నిలిచింది. ఈ ఘనతను సాధించిన మొదటి ఇండియన్ సెలబ్రెటీగా ఆమె గుర్తింపు అందుకుంది.

ఫొటోలు వైరల్
ఖతార్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అభిమానులు వీక్షించారు. అయితే అందులో దీపికా పదుకొన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం మరొక విశేషం. మ్యాచ్ మొదలయ్యే ముందు ఆమె ఫిఫా వరల్డ్ కప్ లో ఆవిష్కరించిన ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఎందుకు వెళ్లిందంటే..
అయితే అంతటి ప్రఖ్యాత వరల్డ్ కప్ లో దీపిక పదుకొన్ ఎందుకు అంత హైలైట్ గా నిలిచింది అని వివరాల్లోకి వెళితే.. ఆమె ప్రముఖ సంస్థ లూయిస్ విట్టన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అదే సంస్థ ఫిఫా వరల్డ్ కప్ కు కూడా స్పాన్సర్స్ లో ఒకటిగా కొనసాగుతోంది. దీంతో ఫైనల్ కప్ ఆవిష్కరణలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న దీపిక పదుకొన్ ను పంపించడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు దీపికా పదుకొన్ ఫాలోవర్స్ నెగిటివ్ ట్రోల్స్ కు కౌంటర్ ఇచ్చేలా కామెంట్స్ చేస్తున్నారు.