For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bhuj: The Pride of India first review లైవ్ అప్‌డేట్స్.. 1971 ఇండియా, పాక్ యుద్ధంలో ఏం జరిగిందంటే?

  |

  బాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ అజయ్ దేవగణ్ నటించిన భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ యాప్‌లో రిలీజైంది. లాక్‌డౌన్ కారణంగా పలు నెలలు వాయిదా పడిన ఈ చిత్రం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అభిషేక్ దుదైయా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్‌తోపాటు సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి, శరద్ కేల్కర్, ఆమ్మీ విర్క్, ప్రణిత సుభాష్, ఇహానా ధిల్లాన్ నటించారు. 1971లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్దం నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. మాదాపూర్ అనే గ్రామంలో అప్పటి ఇండియన్ ఏయిర్ ఫోర్స్ స్క్రాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ 300 మంది మహిళలతో ఇండియన్ ఏయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ నిర్మించిన కథగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి సంబంధించిన హైలెట్స్ మీ కోసం..

  Bhuj: The Pride of India first review, highlights and live updates

  1
  విజయ్ కార్నిక్‌గా అజయ్ దేవగణ్
  రాంచోర్దాస్ పాగిగా సంజయ్ దత్
  జేతా మధర్‌పార్యగా సోనాక్షి సిన్హా
  హీనా రెహ్మన్‌గా నోరా ఫతేహి
  మిలిటరీ ఆఫీసర్ రామ్ కరణ్‌గా శరద్ కేల్కర్ నటించారు.

  2
  1947లో భారత్, పాకిస్థాన్ విడిపోయినప్పుడు తీసుకొన్న నిర్ణయమే దేశానికి శాపంగా మారింది. దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్థాన్‌కు 75 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బుతోనే ఆయుధాలు, రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు భారతీయ సైనికులపై గుళ్ల వర్షం కురిపిస్తున్నారు అంటూ విజయ్ కార్నిక్ ఆవేదన వ్యక్తం చేయడం ఓ హైలెట్‌గా మారింది.

  3

  అయితే పాక్ సేనలు కచ్‌లోని ఎయిర్‌బేస్‌పై బాంబుల వర్షం కురిపిస్తారు. దాంతో రన్ వే పూర్తిగా ధ్వంసం అవుతుంది. కచ్‌పై దాడి చేయడానికి పాకిస్థాన్ సేనలు వేలల్లో తరలి వస్తుంటారు. భారత సేనలు మాత్రం వందల్లో మాత్రమే ఉంటారు.

  4

  మిలటరీ ఆఫీస్ రామ్ కరణ్ భారత సేనల్లో ధైర్యాన్ని నింపుతాడు. చివరి రక్తం బొట్టు వరకు పోరాటం చేసి పాక్ సేనల్ని కచ్ ప్రాంతంలో అడుగుపెట్టకుండా అడ్డుకొందామని అంటాడు.

  5

  అయితే రన్ వే ధ్వంసమైన తీరు చూసి అక్కడికి మరమత్తుల చేయడానికి వచ్చిన సిబ్బంది పారిపోతారు. దాంతో విజయ్ కార్నిక్ ఆశలు నీరుగారిపోతాయి.

  6

  దాంతో కచ్ ప్రాంతంలోని మాదాపూర్ గ్రామస్థుల సహాయాన్ని కోరుతాడు విజయ్ కార్నిక్. అయితే గ్రామంలో మొత్తం మహిళలే ఎక్కువగా ఉంటారు. బతుకు తెరువు కోసం మగవాళ్లంతా పట్టణాలకు వెళ్లిపోతారు. దాంతో మహిళలందరూ రన్ వేను పునర్ నిర్మించడానికి సిద్దమవుతారు.

  7

  మాదాపూర్‌లోని గ్రామంలోని మహిళలందరికీ సుందర్ బెన్ ( సోనాక్షి సిన్హా) నాయకత్వం వహిస్తారు. రన్ వే పనులు కొసాగుతుండగా మరోవైపు పాక్ సేనలు కాల్పులు కొనసాగిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వందలాది మంది భారత సైనికులు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు.

  8

  రన్ వే నిర్మిస్తున్న మాదాపూర్ గ్రామ ప్రజలపై పాక్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తాయి. దాంతో నిర్మిస్తున్న రన్ వే మొత్తం పాడైపోతుంది. అయితే మహిళలు ఏమాత్రం భయపడకుండా మళ్లీ రన్ వేను నిర్మిద్దాం అంటూ సిద్దమవుతారు.

  నటీనటులు: అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి, శరద్ కేల్కర్, అమ్మీ విర్క్, ప్రణితా సుభాష్, ఇహాన్ థిల్లాన్
  దర్శకత్వం: అభిషేక్ దుదైయ్యా
  రచన: అభిషేక్ దుదైయ్యా, రితేష్ షా, పూజా భవోరియా
  నిర్మాతలు భూషణ్ కుమార్, కిషన్ కుమార్, కుమార్ మంగత్ పాథక్, బన్నీ సంంఘ్వీ, వజీర్ సింగ్, అభిషేక్ దుదైయ్యా
  సినిమాటోగ్రఫి: అసిమ్ బజాజ్
  ఎడిటింగ్: ధర్మేంద్ర శర్మ
  మ్యూజిక్: అమర్ మొహిలే
  బ్యానర్: టీ సిరీస్, అజయ్ దేవగన్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్ ఎల్ఎల్పీ
  ఓటీటీ రిలీజ్: డిస్నీ+ హాట్ స్టార్
  ఓటీటీ రిలీజ్ డేట్: 2022-08-13

  English summary
  Ajay Devgan's Bhuj: The Pride of India movie released on Disney+ hotstar. Here is the highlights of the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X