బికినీలో బిగ్‌బాస్ బ్యూటీ.. లైఫ్ పార్ట్‌నర్‌తో కలిసి మాల్దీవుల్లో రచ్చ
బిగ్‌బాస్ బ్యూటీ రుబీనా దిలాయిక్ అంటే బుల్లితెర ప్రేక్షకులకు ఎంత క్రేజ్ అంటే మాటల్లో చెప్పనక్కర్లేదు. బుల్లితెర మీదే కాకుండా సోషల్ మీడియాలో తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటూ అభిమానులకు గ్లామర్ ట్రీట్‌ను అందిస్తుంటారు. అయితే బిగ్‌బాస్ 14 విజేతగా నిలిచిన తర్వాత రుబీనా అందాల అరబోతకు అడ్డేలేకుండా పోయింది. తాజాగా రుబీనా దిలాయిక్ బికినీ ఫోటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం రుబీనా గ్లామర్, పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

బుల్లితెరపైన సీరియల్స్‌లో
రుబీనా దిలాయిక్ కెరీర్ బుల్లితెర సీరియల్స్‌తో ప్రారంభమైంది. చోటి బహు సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకొన్న ఆమె తన కెరీర్‌లో డజనుకుపైగా సీరియల్స్ చేసి మెప్పించారు. పవిత్ర రిస్తా, చోటి బహు 2, పునర్వివాహ్, ససురాల్ ిమర్ కా, సావిత్రి దేవి కాలేజ్ అండ్ హాస్పిటల్, బాక్స్ క్రికెట్ లీగ్, ఇష్క్ మే మర్జవాన్, తు ఆషికీ లాంటి టెలివిజన్ కార్యక్రమాలతో స్టార్‌గా మారారు.

బిగ్‌బాస్ 14 విజేతగా
ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా సుదీర్ఘంగా సాగుతున్న బిగ్‌బాస్ 14లో పాల్గొన్న తర్వాత రుబీనా జాతకమే మారిపోయింది. బిగ్‌బాస్ 14 విజేతగా నిలిచిన తర్వాత మరింత క్రేజ్ పెరిగింది. ఏకంగా బుల్లితెర మీద నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం బరేలికి బేటీ, అర్ధ్ చిత్రాల్లో నటించింది. త్వరలోనే అర్ధ్ చిత్రం రిలీజ్ కానున్నది.

భర్తతో బ్రేకప్ రూమర్లు
ఇక ప్రొఫెషనల్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ పరంగా కూడా రుబీనా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నది. బిగ్‌బాస్ 14 కొనసాగుతుండగానే.. అభినవ్‌తో బ్రేకప్ వార్తలు ఊపందుకొన్నాయి. బిగ్‌బాస్‌కు ముందే భర్త అభినవ్‌కు డైవోర్స్ ఇచ్చి రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పాలనే నిర్ణయం తీసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో మూడేళ్ల వైవాహిక జీవితానికి తెరపడే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకొన్నాయి. అయితే వారిద్దరూ తమ రిలేషన్‌షిప్ బ్రేకప్ కాకుండా జాగ్రత్త పడటం గమనార్హం.

మాల్దీవుల పర్యటనలో బిగ్‌బాస్ బ్యూటీ
అయితే అభివన్ శుక్లా, రుబీనా దిలాయిక్ వైవాహిక జీవితం జోరుగా సాగుతున్నది. వారిద్దరూ ఇటీవల మాల్దీవుల పర్యటనకు వెళ్లి ఎంజాయ్ చేశారు. అయితే మాల్దీవుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో రుబీనా షేర్ చేయగా వైరల్ అయ్యాయి. రుబీనా అందం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫోటోలు అభినవ్, రుబీనా దాంపత్య జీవితం ఎంత బలమైనదో అనే విషయం రుజువు చేసింది.

బికినీలో రచ్చ చేసిన రుబీనా
మాల్దీవుల పర్యటనలో రుబీనా పింక్ కలర్ నియాన్ బికినీలో దర్శనమిచ్చింది. సముద్ర తీరంలో ఆమె హాట్ హాట్‌గా కనిపించింది. అంతేకాకుండా ఎల్లో బికినీలో కూడా దర్శనమిచ్చి ఆకట్టుకొన్నది. గాల్లోకి ఎగురుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. బికినీ అందాలతో తన అభిమానులకు మ్యాజిక్ పంచింది. ప్రస్తుతం రుబీనా బికినీ ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











