సొనాలి బింద్రే మరణించింది.. బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్! అసలేం జరిగిందంటే..
Recommended Video

క్యాన్సర్ వ్యాధికి గురైన సొనాలి బింద్రే మరణించిందంటూ ట్వీట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్‌కు నెటిజన్లు చుక్కలు చూపించారు. దాంతో బీజేపీ ఇబ్బందిలో పడింది. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం రామ్ కదమ్‌కు తొలిసారి కాదు. గతంలో మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో కూరుకుపోయారు. తాజాగా సొనాలి బింద్రేపై వ్యాఖ్యలు చేసి బీజేపీకి తలవంపులు తెచ్చిపెట్టారు. ఇంకా ఏం జరిగిందంటే..

సొనాలి బింద్రే ఇకలేరంటూ
హిందీ, మరాఠీ చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకొన్న సొనాలి బింద్రే ఇకలేరు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అమెరికాలో కన్నుమూశారు అనే వార్త సోషల్ మీడియాలో వచ్చిన సందేశాన్ని రామ్ కదమ్ షేర్ చేశాడు. అయితే ఆ వార్త నిజమా? వాస్తవమేంతా అనే విషయాన్ని పట్టించుకోలేకుండా సోషల్ మీడియాలో షేర్ చేయడం వివాదాస్పదమైంది.

ఫేక్ న్యూస్ అని తేలడంతో
సొనాలి బింద్రే మరణ వార్తపై అభిమానులు ఆందోళన చెందారు. ఫేక్ న్యూస్ అని తేలడంతో నెటిజెన్స్ రామ్ కదమ్‌ను ట్రోల్స్ చీల్చి చెండాడారు. దాంతో అసలు విషయం తెలుసుకొన్న రామ్ కదమ్ తన తప్పుకు క్షమాపణ చెప్పారు. ఆయన తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు.

రామ్ కదమ్ క్షమాపణ
సొనాలి బింద్రేపై వచ్చిన మరణ వార్త రూమర్. అందులో వాస్తవం లేదు. గత రెండు రోజులుగా నేను బాధలో మునిగిపోయాను. చేసిన తప్పుకు చింతిస్తున్నాను. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని రామ్ కదమ్ ట్వీట్ చేశారు.

సొనాలికి అమెరికాలో చికిత్స
సొనాలి బింద్రే ప్రస్తుతం అమెరికాలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొంటున్నారు. ఆమె వెంట భర్త గోల్డి బెహల్ ఉన్నారు. ఇటీవల ఆమె స్నేహితులు ప్రియాంకా చోప్రా తదితరులు కలుసుకొని నైతికంగా మద్దతు తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











