For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ranveer Singh: మొదట్లో అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నా.. క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్

  |

  సినిమా ప్రపంచంలో క్యాస్టింగ్ కోచ్ అనేది ఎంతగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది ఇప్పుడున్న స్టార్స్ కూడా ఒకప్పుడు ఆ చేదు అనుభవాలను దాటి వచ్చిన వారే. అయితే చాలావరకు స్టార్స్ ఇలాంటి విషయాలను చెప్పుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ కొందరు మాత్రం చాలా ధైర్యంగా స్పందిస్తూ ఉంటారు. కేవలం నటిమణులు మాత్రమే కాకుండా నటులకు కూడా ఈ తరహా ఇబ్బందులు రావడం షాక్ కు గురి చేస్తూ ఉంటుంది. అది కూడా ఒక స్టార్ హీరో క్యాస్టింగ్ కౌచ్ బాధితుడనని చెప్పడం వైరల్ గా మారింది. అతను మరెవరో కాదు రణ్ వీర్ సింగ్. ఇటీవల ఒక అవార్డు ఈవెంట్ లో అతను తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చాలా సున్నితంగా వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  రణ్ వీర్ కు అవార్డ్

  రణ్ వీర్ కు అవార్డ్

  బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రణ్ వీర్ సింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రలో నటించినా కూడా అతను చాలా విభిన్నంగా తనను తాను హైలైట్ చేసుకుంటూ ఉంటాడు. ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ఉండేలా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక అతనికి ఇటీవల ఎటోయిల్ డి'ఓర్ అవార్డును అందుకున్నాడు.

  అమితాబ్ తరువాత

  అమితాబ్ తరువాత

  మర్రకేచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవల నార్త్ ఆఫ్రికా మొరాకోలో జరిగింది. ఇక ఈ ఏడాదికి గానూ 19వ ఎడిషన్‌లోని ఎటోయిల్ డి'ఓర్ అవార్డును బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్రముఖ అవార్డు ఇంతకుముందు బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ మాత్రమే అందుకున్నారు. ఇక ఇప్పుడు రణ్ వీర్ ఆ రికార్డును అందుకున్నాడు.

  ఆకట్టుకున్న రణ్ వీర్

  ఆకట్టుకున్న రణ్ వీర్

  ఇక అదే వేడుకలో రణ్ వీర్ కెరీర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ లో ఒకటైన బాజీరావ్ మస్తానీ చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రపంచ నలుమూలల నుంచి సినీ దిగ్గజాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఇక అందులో రణ్ వీర్ ఈ అవార్డు అందుకొని తన మాటలతో డ్యాన్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ర్యాప్ రూపంలో కెరీర్ గురించి చెప్పి, ఎంతగానో హైలెట్ అయ్యాడు.

   చేదు అనుభవాలు

  చేదు అనుభవాలు

  రణ్ వీర్ సింగ్ తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను కూడా పంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా స్పందించారు. తన మొదటి సినిమా బ్యాండ్ బాజా బారాత్‌ కు ముందు రణవీర్ ముంబైలో తన మూడున్నర సంవత్సరాల పోరాట దశ గురించి వివరణ ఇచ్చారు. కొందరు అవకాశాలు ఇస్తామని తేడాగా వ్యవహరించారని, తేడాగా మాట్లాడారని చెప్పాడు.

  అతను అలా మాట్లాడాడు

  అతను అలా మాట్లాడాడు

  రణ్ వీర్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి నన్ను ఒక ప్రదేశానికి పిలిచి 'నువ్వు హార్డ్ వర్క్ చేస్తావా లేదా స్మార్ట్ వర్క్ చేస్తావా అని అడిగాడు. అందుకు నేను కష్టపడి పనిచేసేవాడినని చెప్పాను. దీంతో అతను 'డార్లింగ్, బి స్మార్ట్, సెక్సీ'లా ఉండు అని మరొక విధంగా మాట్లాడాడు. ఆ విధంగా దాదాపు ఆ మూడున్నరేళ్లలో నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇక నేను నా సొంత ప్రయత్నాలు నిజాయితీగా చేసినప్పుడు కాస్త ఆలస్యమైనా కూడా ఇప్పుడు అవకాశాలు మెండుగా వస్తున్నట్లు.. రణ్ వీర్ వివరణ ఇచ్చారు.

  English summary
  Bollywood actor Ranveer Singh shocking comments on casting couch experience
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X