5G టెక్నాలజీని ఆపివేయండి.. మానవజాతి మనగడకు ముప్పు.. కోర్టులో జుహీ చావ్లా పిటిషన్
బాలీవుడ్ నటి జుహీ చావ్లా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భారత టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ఉత్తమ సేవల కోసం 5జీ టెక్నాలజీని తీసుకొచ్చే ప్రయత్నాలను నిరసిస్తూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణానికి హానీ కలిగించే ఈ టెక్నాలజీని ఆపివేయాలని జుహీ చావ్లా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించారు.
మొబైల్, ఇంటర్నెట్ ఆధారిత సేవల రంగంలోకి 5G టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడానికి మేము వ్యతిరేకం కాదు. ప్రపంచవ్యాప్తంగా వైర్‌లెస్ కమ్యూనికేషన్ రంగంలో వినియోగిస్తున్న టెక్నాలజీకి మేము వ్యతిరేకం. సెల్‌ఫోన్ నెట్‌వర్క్స్, వైర్‌లెస్ గాడ్జెట్స్ నుంచి వచ్చే రేడియో ఫ్రిక్వెన్సీ రేడియేషన్ ముప్పుపై జరిగిన పరిశోధనల ఫలితాలు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇప్పుడు ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. వాటి వల్ల ఉత్పత్తి అయ్యే రేడియేషన్ ఆరోగ్యానికి మరింత హానికరం అనే విషయం ఆందోళనకు గురిచేస్తున్నది అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం భూ పర్యావరణంలో రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ 10x to 100x స్థితిలో ఉంది. 365 రోజులపాటు ఏ మొక్కకు, ఈ కీటకానికి, ఏ పక్షికి, ఏ జంతువుకు, ఏ వ్యక్తి ప్రాణాలకు హాని కలిగించకుండా ఈ 5G టెక్నాలజీని అమలు చేయడం గానీ, అందుబాటులోకి తీసుకురాగలమన్న హామీ ఇవ్వగలరా అని జుహీ ప్రశ్నించారు. భూమండలానికి, మానవ జాతికి 5G ప్లాన్స్ మరింత హానికరమనే విషయాన్ని పరిశోధనలు వెల్లడించాయనే విషయాన్ని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











