కంగనా రనౌత్ పెళ్లి? పెళ్లై పిల్లలున్న అతనితో వివాహం.. స్పందించిన బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, పొలిటిషీయన్ కంగనా రనౌత్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ దక్కించుకున్నారు. బాలీవుడ్ లో వరుస చిత్రాలల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అతి చిన్న వయస్సుల్లోనే అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లో సక్సెస్ చూసిన హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇదెలా ఉంటే ఇటీవల కంగనా రనౌత్ మీద కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి. తన డేటింగ్ పై వచ్చిన డేటింగ్ రూమర్లకు కంగనా రనౌత్ తాజాగా సమాధానం చెప్పింది. వాటిని ఖండిస్తూ ఇలా స్పందించింది.
కంగనా డేటింగ్ అంటూ రూమర్లు?
కంగనా రనౌత్ గురించి ప్రస్తుతం డేటింగ్ రూమర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజులుగా కంగనా రనౌత్ గురించి పుకార్లు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో తను రిలేషన్ షిప్ లో ఉండేదని, ఇక తాజాగా ఇండియన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆదిత్య పంచోలితో డేటింగ్ లో ఉందంటూ కొందరు ప్రచారం చేశారు. కొద్ది రోజులుగా ఈ వార్తలు ఊపందుకున్నాయి. అయితే వీటిపై తాజాగా హీరోయిన్ కంగనా రనౌత్ ఘటుగా స్పందించారు.

కంగనా రనౌత్ కామెంట్స్..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరియు బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలితో కంగనా డేటింగ్ వార్తలు, ఇక త్వరలో ఆదిత్యతో పెళ్లి కూడా అంటూ రూమర్లు ప్రచారం అయ్యాయి. దీనిపై కంగనా రనౌత్ తాజాగా ఇలా స్పందించింది. అసలు ఆ రూమర్లలో ఎలాంటి వాస్తవం లేదని ఆమె వివరించినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఎవరో కావాలని ఇలా టార్గెట్ చేసి తనపై తప్పుడు వార్తలను ప్రచారం అయ్యేలా చేస్తున్నారని మండి పడింది. నా వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం ఏమాత్రం సరికాదని చెప్పుకొచ్చింది. దీంతో ఆ డేటింగ్ రూమర్లన్నీ కొట్టుకుపోయాయి.
ప్రస్తుతం కంగనా రనౌత్ నటిగా ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు పొలిటిషన్ ప్రజలకు సేవ చేస్తోంది. చివరిగా ఎవర్జెన్సీ అనే చిత్రంతో ఆకట్టుకుంది. ఇక హిమచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైంది. ప్రజలకు సేవ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ప్రజాక్షేత్రంలో పని చేస్తోంది. ఇక చిత్ర పరిశ్రమలో నిర్మాతగానూ పలు ప్రాజెక్ట్స్ ను రూపొందిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ప్రస్తుతం కంగనా రనౌత్ కు 39 ఏళ్లు. ఆమె 1986 మార్చి 23న మండి, హిమాచల్ ప్రదేశ్ లోనే జన్మించడం విశేషం.
ఇప్పటికీ కంగనా రనౌత్ సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక 2006 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. 20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఆమె అందించిన సేవలకు గానూ పద్శశ్రీ అవార్డును 2020లో అందుకోవడం విశేషం. ఎమర్జెన్సీ చిత్రం తర్వాత నెక్ట్స్ తెలుగు, హిందీ బైలింగ్వుల్ గా ఓ సినిమా చేయబోతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా ఆ ప్రాజెక్ట్ రూపుదిద్దు కోబోతోందని తెలుస్తోంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











