Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రముఖ కోరియోగ్రాఫర్‌కు తీవ్రమైన గుండెపోటు.. ఐసీయూకు తరలింపు
ప్రముఖ కోరియోగ్రాఫర్, బాలీవుడ్ దర్శకుడు రెమో డిసౌజా తీవ్రమైన గుండెపోటుుకు గురయ్యారు. దాంతో ఆయనను హుటాహుటిన ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. సకాలంలో ఆయనను హాస్పిటల్‌కు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటగా ఉంది. 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుంది అని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
శుక్రవారం ఉదయమే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పితో బాధపడుతుండటంతో ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించాం. ఆయన పరిస్థితిని గమనించిన వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఐసీయూలోనే ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

రెమో డిసౌజా కెరీర్ విషయానికి వస్తే...1997లో పరదేశ్ చిత్రంతో కెరీర్ ఆరంభించిన ఇటీవల ఏబీసీడీ, ఫాల్తూ లాంటి చిత్రాలతోపోటు సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 చిత్రానికి పనిచేశారు. ఏడీసీడీ 2, ఏ ఫ్లయింగ్ జాట్, రేస్ 3 చిత్రాలకు దర్శకత్వం వహించారు. జీరో, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ, టైమ్ టూ డ్యాన్స్ చిత్రాలకు పనిచేశారు.
ఇక బుల్లితెర మీద డ్యాన్స్ ఇండియా, ఝలక్ దిక్లాజా రియాలిటీ షోలు హోస్ట్‌గా వ్యవహరించారు.