Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: తూ.. దీనమ్మ జీవితం..ఫైనల్కు పోయిన ఆనందం కూడా లేదు!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Tiger 3: ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు పవర్ఫుల్ హీరోలు.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం కాయం..
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు తరచుగా వస్తూనే ఉంటాయి. చాలా కాలంగా అక్కడ స్టార్స్ కలిసి నటిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో టైగర్ 3 సినిమా కోసం ముగ్గురు హీరోలు ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను బ్రేక్ చేయడం కాయమని అర్థమవుతోంది. సల్మాన్ ఖాన్ ఇదివరకే కొంతమంది హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. దాదాపు ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అంధించాయి.
ఏ సినిమా కూడా పెద్దగా నష్టపోయింది లేదు. ఇక సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో ప్రజాదరణ అందుకున్న సినిమాలలో టైగర్ సినిమాలు ఉన్నాయి. ఇక తదుపరి ఫ్రాంచైజ్ మూవీలో మరో ఇద్దరి హీరోలను కలపబోతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడం కాయం. యవారేజ్ టాక్ వచ్చినా కూడా మినిమమ్ 300కోట్లు దాటించేస్తున్నాడు. ఇక టైగర్ జిందా హై , ఏక్ తా టైగర్ వంటి సినిమాలు సరికొత్త సంచలన విజయాన్ని అందుకున్నాయి.

ఆ ఫ్రాంచైజ్ లో సల్మాన్ ఖాన్ RAW ఏజెంట్ గా నటించాడు. అదే పాత్రను కంటిన్యూ చేస్తూ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను వెండితెరపై అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రజెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా మంచి ఎమోషన్ ను కూడా హైలెట్ చేస్తున్నారు. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో సల్మాన్ ఖాన్ ఇప్పుడు మూడవసారి టైగర్ 3 అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాతో రాబోతున్నాడు. సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సల్మాన్ ఖాన్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా స్పెషల్ పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వారు మరెవరో కాదు. షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ ఇద్దరు ఒకేసారి సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో స్పెషల్ గా ఎంట్రీ ఇస్తారట. ఇప్పటికే షారుక్ కు సంబంధించిన సీన్స్ కొన్ని షూట్ చేశారు. ఇక హృతిక్ రోషన్ కు సంబంధించిన సీన్స్ కూడా ఫినిష్ చేయాల్సి ఉందట. యాక్షన్ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చే ఆ హీరోలు ప్రేక్షకులకు కనువిందు చేస్తారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ అడిగితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మిగతా హీరోలు అతిధి పాత్రలు చేయడానికి ఏ మాత్రం అభ్యంతరం చెప్పరు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఎవరైనా తన సహాయం కొరివస్తే తప్పనిసరిగా ఎదో ఒక విధంగా సినిమాల్లో కనిపిస్తూనే ఉంటాడు. గతంలో చాలాసార్లు షారుక్ ఖాన్ సినిమాలో కూడా కనిపించాడు. ఇక టైగర్ 3 సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.