»   » న్యూడ్ ఫోటోస్ లీక్ చేస్తానని బెదిరింపులు: హీరో బావ మీద కేసు నమోదు!

న్యూడ్ ఫోటోస్ లీక్ చేస్తానని బెదిరింపులు: హీరో బావ మీద కేసు నమోదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
న్యూడ్ ఫోటోస్ లీక్ చేస్తానని బెదిరింపులు హీరో బావ మీద కేసు నమోదు!

బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ బావ అమిత్ గిల్ మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఎయిర్‌హోస్టస్‌ను వేధింపులకు గురి చేయడంతో పాటు ఆమె న్యూడ్ ఫోటోలు ఆన్ లైన్‌లో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అమిత్ గిల్ రాంపాల్ సిస్టర్ కోమల్‌ను పెళ్లాడారు.

అమిత్ గిల్ సదరు ఎయిర్ హోస్టెస్‌ను తన నివాసమైన ఆనంద్ విల్లాకు పిలిచాడని, అక్కడ ఆమెకు డ్రింక్స్ ఆఫర్ చేసి ఆపై అశ్లీలంగా ఫోటోస్ తీశాడని, అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడని.... ఓ ఆంగ్లపత్రిక తన కథనంలో పేర్కొంది.

18 లక్షలు వ్యవహారం, ఆపై బెదిరింపుల

18 లక్షలు వ్యవహారం, ఆపై బెదిరింపుల

ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న ఎయిర్ హోస్టెస్ అమిత్ గిల్ క్లైయింటుగా ఉన్నారు. అతడికి 18 లక్షలు ఇచ్చి ఆమె తన తరుపున ఇన్వెస్ట్ చేయాలని కోరారు. ఆ డబ్బుపై మంచి రిటర్న్స్ వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తానని అతడు ప్రామిస్ చేశాడని తెలుస్తోంది. అయితే ఆశించిన రిటర్న్స్ రాక పోవడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని బాధితురాలు డిమాండ్ చేసింది. అయితే అతడు పూర్తి డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆమెను తిరిగి బెదిరించడం ప్రారంభించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 అలా గిల్ పరిచయం అయ్యాడు

అలా గిల్ పరిచయం అయ్యాడు

‘కామన్ ఫ్రెండ్ గిల్‌తో కలిసి రూ. 80 లక్షలు ఇన్వెస్ట్ చేసింది. మంచి రిటర్న్స్ వస్తాయని నమ్మించి నన్ను కూడా ఇన్వెస్ట్ చేసేలా చేశాడు. ఇందుకోసం తన వద్ద ఉన్న ఫిక్డ్స్ డిపాజిట్స్ రూ. 18 లక్షలు విత్‌డ్రా చేసి ఇచ్చాను. ప్రతి నెల 3 శాతం రిటర్న్స్ వచ్చేలా చేస్తానని గిల్ ప్రామిస్ చేశాడని, తాను పని నిమిత్తం అబుదాబి-దుబాయ్‌లో ఎక్కువగా ఉంటాను. ఆ ఇన్వెస్ట్ మెంట్ ద్వారా వచ్చే ఆదాయంతో ముంబైలో ఒంటరిగా ఉంటున్న తన తల్లి బాగోలు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తాను ఇన్వెస్ట్ చేశానని బాధితురాలు తెలిపింది.

12 లక్షలు మాత్రమే ఇచ్చాడు

12 లక్షలు మాత్రమే ఇచ్చాడు

అయితే అతడు చెప్పిన విధంగా రిటర్న్స్ రాక పోవడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని బాధితురాలు గిల్‌ను కోరింది. ఈ మేరకు అతడు ఆమెకు చెక్ ఇవ్వగా అది బౌన్స్ అయింది. దీంతో బ్యాంక్ అకౌంటుకు ట్రాన్ఫర్ చేస్తానని చెప్పిన అతడు కేవలం 12 లక్షలు మాత్రమే బదిలీ చేశాడు.

ఫోటోలతో బెదిరింపులు

ఫోటోలతో బెదిరింపులు

తనకు రావాల్సిన మిగిలిన 6 లక్షలు ఇంట్రెస్టుతో సహా ఇవ్వాలని జూన్ 15, 2017 నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నాను. అయితే గిల్ తనను బెదిరించడం మొదలు పెట్టాడు. అసభ్యంగా తీసిన నా ఫోటోలు పంపి మళ్లీ డబ్బులు అడిగితే వీటిని సోషల్ మీడియాలో పెడతాను అని బెదిరించడం మొదలు పెట్టాడు... అని బాధితురాలు పేర్కొంది.

ఆ సమయంలో తీసిన ఫోటోలే

ఆ సమయంలో తీసిన ఫోటోలే

2016 ఆగస్టులో గిల్ తనను ఒకసారి ఇంటికి పిలిచి డ్రింక్ ఆఫర్ చేశాడు. ఆ సమయంలో అందులో ఏదో కలిపాడు. అపుడు నేను అపస్మారక స్థితిలోకి వెళ్లాను. ఆ సమయంలో అశ్లీలంగా ఫోటోస్ తీశాడు అని బాధితురాలు పేర్కొన్నారు.

328, 354, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు

328, 354, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు

గిల్ మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ముంబై 9వ జోన్ డిప్యూటీ కమీషనర్ పరమ్‌జీత్ సింగ్ దహియా తెలిపారు. గిల్ మీద 328, 354, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

English summary
Mumbai Police have booked Bollywood actor Arjun Rampal's brother-in-law Amit Gill for allegedly molesting an air hostess and threatening to put up her obscene pictures online.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X