twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరువు నష్టం కేసులో శిల్పా శెట్టికి హైకోర్టు షాక్.. కుండ బద్దలుకొట్టేసిందిగా!

    |

    పోర్న్ కంటెంట్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. అతని గురించి వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. ఇందులో పోలీసు వర్గాల కధనాలు అని చెబుతూ శిల్ప గురించి కూడా అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పరువు నష్టం కేసు అని రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టి భావిస్తున్నారు. ఈ విషయంలో ఆమె బాంబే హైకోర్టులో ఒక పిటిషన్ వేయగా దాని విచారణ నేడు జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే

    భర్తపై తీవ్రమైన కేసు

    భర్తపై తీవ్రమైన కేసు

    అనేక మీడియా సంస్థలపై శిల్పా శెట్టి చేసిన పరువు నష్టం దావాను బాంబే హైకోర్టు ఈ రోజు (జూలై 30, శుక్రవారం) విచారించింది. పోలీసు వర్గాలను ఉటంకిస్తూ మీడియా ఏదైనా వార్తలను ప్రసారం చేస్తే అది ఎలా తప్పు అని హైకోర్టు శిల్పా శెట్టి న్యాయవాదిని ప్రశ్నించింది. మీ క్లయింట్ భర్తపై తీవ్రమైన కేసు ఉందని శిల్పా శెట్టి న్యాయవాదికి హై కోర్టు చెప్పింది.

    హైకోర్టు జోక్యం చేసుకోదు

    హైకోర్టు జోక్యం చేసుకోదు

    మీడియా ఈ కేసును కవర్ చేస్తుందని, భారతదేశంలో మీడియాకు వార్తలను ప్రచురించడానికి మరియు చూపించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. మీడియా స్వేచ్ఛను ప్రభావితం చేసే పనిని హైకోర్టు చేయదని పేర్కొంది. అంటే, ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోదని కుండ బద్దలు కొట్టింది. ఇక మీ క్లయింట్ ఎవరైతే పరువు నష్టం వేశారో దాని గురించి ఒక నిర్దిష్ట చట్టం ఉందని, ఆ చట్టానికి లోబడే కోర్టు పనిచేస్తుందని పేర్కొంది. ఈ కేసుని సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది.

    ఆగస్టు 2న బెయిల్

    ఆగస్టు 2న బెయిల్


    ఇక ఆగస్టు 2న మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ కేసులో రాజ్ కుంద్రా ముందస్తు బెయిల్ పిటిషన్ పై ముంబై సెషన్స్ కోర్టు తన ఉత్తర్వులను ప్రకటించనుంది.బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల కేసులో గట్టిగానే ఇరుక్కున్నారు. రాజ్ 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక ఈ సందర్భంలో, రాజ్ ఇబ్బందులు నిరంతరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

    అన్నిట్లో శిల్ప పేరు

    అన్నిట్లో శిల్ప పేరు


    నిజానికి పోర్న్ వ్యాపారంలో శిల్పా శెట్టి పేరు మాత్రమే కాకుండా, శిల్పా శెట్టి ఫోటోలు కంపెనీ లెటర్ హెడ్స్, బ్రోచర్లు మరియు ఇతర పేపర్లలో కూడా ఉపయోగిస్తున్నారు. అంటే, రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుండి, శిల్పా శెట్టి కూడా నిరంతరం వార్తల్లోనే ఉంటున్నారు. అందుకు తగ్గట్టుగానే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రాజ్ కుంద్రా యొక్క హాట్‌షాట్ యాప్ నుండి శిల్పా శెట్టి మరియు రాజ్ కుంద్రాల ఉమ్మడి ఖాతాకు చాలా డబ్బును బదిలీ చేసినట్లు వార్తలు ఉన్నాయి.

    శిల్పకి నో క్లీన్ చిట్

    శిల్పకి నో క్లీన్ చిట్


    అయితే ఈ మొత్తం ఎపిసోడ్ గురించి నటికి ఇప్పటికే తెలుసా, లేదా ఆమె స్వయంగా ఇందులో పాల్గొన్నారా అని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ విషయం గురించి నిగ్గు తేల్చడానికే ఏజెన్సీ దర్యాప్తులో నిమగ్నమై ఉంది. మరియు శిల్పా బ్యాంక్ ఖాతాల దర్యాప్తు కూడా కొనసాగుతోంది. అయితే ఇప్పటి దాకా ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వలేదు.

    Recommended Video

    Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
    3000 కోట్ల మోసం

    3000 కోట్ల మోసం


    ఇక మరో ఆన్‌లైన్ గేమింగ్ గాడ్ (GOD- గేమ్ ఆఫ్ డాట్స్) ద్వారా దేశంలో వేలాది మంది ప్రజలను మోసం చేశారని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ రాజ్ కుంద్రా పై తీవ్రమైన కొత్త ఆరోపణ చేశారు. అంతే కాక రాజ్ కుంద్రా పేదల నుంచి 3000 కోట్ల రూపాయలు మోసం చేసి లూటీ చేశాడని ఆయన పేర్కొన్నారు.

    English summary
    Bombay HC passes interim order about injunction on actor Shilpa Shetty's plea. HC says - No part of this shall be constructed as a gag on media. The defendants other than those who've been asked to take down their articles will have to file an affidavit. Next hearing on 20th Sept.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X