twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహిళతో చిన్న పిల్లల లైంగిక సన్నివేశాలు.. స్టార్ నటుడి మీద వరుస కేసులు!

    |

    బాలీవుడ్ నటుడు , చిత్ర నిర్మాత మహేష్ మంజ్రేకర్ పై కేసు నమోదైంది. చిన్న పిల్లల్లను అసభ్య సన్నివేశాల్లో చూపిన క్రమంలో ఆయన మీద కేసు నమోదయింది. ఆ వివరాల్లోకి వెళితే..

     తెలుగులో

    తెలుగులో

    మహేష్ మంజ్రేకర్ ఒక దర్శకుడు, నటుడు, రచయిత మరియు నిర్మాత. వాస్తవ్, అస్తిత్వా, విరుద్ధ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన దర్శకత్వంతో పాటు, అతను తన సొంత నిర్మాణాలతో సహా పలు చిత్రాల్లో నటించారు. అతను 2002 లో వచ్చిన కాంటే చిత్రంలో నటనకు ప్రశంసలు అందుకున్నారు. అలాగే తెలుగులో ఒక్కడున్నాడు, వినయ విధేయ రామ, ఆట ఆరంభం, అదుర్స్, హోమం, గుంటూర్ టాకీస్ వంటి చిత్రాలలో నటించారు. అయితే ఆయన మరాఠీ చిత్రం ' నే వరణ్‌భట్ లోంచా కోన్ నై కొంచా 'పై వివాదం ముదిరింది . సినిమాలోని బోల్డ్ కంటెంట్‌పై ప్రశ్నలు తలెత్తుతుండగా, రెండు సంస్థలు ఈ చిత్రానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాయి, ఈ క్రమంలో మహేష్ మంజ్రేకర్‌పై కేసు నమోదు చేయబడింది . మహిళా కమిషన్, బాలల కమిషన్ కూడా సినిమాపై కఠినంగా వ్యవహరించాయి.

     మంజ్రేకర్‌పై కేసు

    మంజ్రేకర్‌పై కేసు

    ఈ చిత్రంలో, పిల్లలను మహిళలతో లైంగిక చర్యలో పాల్గొన్నట్టు చూపించారు. టీజ‌ర్, ట్రైల‌ర్‌లో క‌శ్మీరా షాను ఓ చిన్నారితో అసభ్యకర రీతిలో చూపించారు. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి, ఈ చిత్రంపై చాలా సంస్థలు సీరియస్ గా ఉన్నాయి. బాంద్రా కోర్టులో కేసు నమోదైన క్రమంలో ఫిబ్రవరి 28న విచారణకు రానుంది. 'దైనిక్ భాస్కర్' నివేదిక ప్రకారం, మహారాష్ట్రకు చెందిన రెండు సంస్థలు ఈ చిత్రంపై కోర్టులో ఫిర్యాదు చేశాయి. ఈ కేసులో మహేష్ మంజ్రేకర్‌పై బాంద్రా కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో క్షత్రియ మరాఠా సేవా సంస్థ ఈ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మంజ్రేకర్‌పై కేసు నమోదు చేయబడింది.

     పోక్సో కోర్టులో కేసు

    పోక్సో కోర్టులో కేసు


    ఈ కేసులో నరేంద్ర, శ్రేయాన్స్ హిరావత్ మరియు సినిమాకు సంబంధించిన NH స్టూడియోస్‌లను కూడా నిందితులుగా చేర్చారు. ఈ సినిమాలోని కంటెంట్ సమాజంలో తప్పుడు సందేశాన్ని ఇస్తుందని క్షత్రియ మరాఠా సేవా సంస్థ న్యాయవాది డివి సరోజ్ అన్నారు. దీంతో సినిమాను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసు ఇప్పుడు ఫిబ్రవరి 28న విచారణకు రానుంది. పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సినిమాపై పోక్సో కోర్టులో కేసు నమోదు చేయాలని కూడా దరఖాస్తు చేశారు.

    సెన్సార్ బోర్డు పై చర్యలు

    సెన్సార్ బోర్డు పై చర్యలు

    సినిమాకు సెన్సార్ చేసిన సెన్సార్ బోర్డు చైర్మన్ ప్రసూన్ జోషిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఈ సినిమా కంటెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాయి. సినిమా నిర్మాతలపైనే కాకుండా అందులో నటించిన పిల్లల తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకోవాలని కమిషన్ చెబుతోంది. సినిమా నిర్మాతలను పోక్సో చట్టం కింద శిక్షించాలని భారతీయ స్త్రీ శక్తి సంఘటన్ తరపు న్యాయవాది ప్రకాశ్ సల్సింగికర్ అన్నారు. జనవరి 27న పోక్సో చట్టం కింద సెషన్స్‌ కోర్టులో కేసు నమోదైంది. దీని మొదటి విచారణ జనవరి 31న జరిగింది. సినిమాలో మైనర్ పిల్లలు మహిళలతో అనైతిక సంబంధాలు పెట్టుకున్న తీరు చాలా సిగ్గుచేటు అని భారతీయ స్త్రీ శక్తి ప్రెసిడెంట్ సీమా దేశ్‌పాండే అన్నారు.

    సమ్మెలో మిల్లు కార్మికుల కథనం

    సమ్మెలో మిల్లు కార్మికుల కథనం

    'నై వర్ణభట్ లోంచా కొణయ్ కొంచా' సినిమా కథ మిల్లు కార్మికులు, వారి సమ్మె నేపథ్యంలో రూపొందింది. సమ్మె కారణంగా కార్మికుల కుటుంబాలు పడుతున్న కష్టాలను ఈ కథలో చిత్రించారు. దీని వల్ల మనుషులు కూడా నైతికంగా పాడైపోతారని సినిమాలో చూపించారు. మరోవైపు ఈ సినిమాకు వివాదం మీద సందడిపై మహేష్ మంజ్రేకర్ కూడా క్లారిటీ ఇచ్చారు. తన చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్‌ వచ్చిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ''సినిమాను నిర్మించి సెన్సార్‌ బోర్డుకు చూపించాం. మా సినిమాకు 'ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టులో ఉంది. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.

    English summary
    Case Registered against Mahesh Manjrekar for showing a minor child in an intimate scene.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X