twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Katrina Kaif Wedding: మీ పెళ్లి కోసం గుడికి వెళ్లకుండా చేస్తారా.. పెళ్లికి ముందే బాలీవుడ్ జంటపై ఫిర్యాదు!

    |

    బాలీవుడ్ తారలు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అత్యంత భారీ సెక్యూరిటీ నడుమ చాలా గోప్యంగా జరుపుకుంటున్న ఈ వివాహ మహోత్సవం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లాలో జరగనున్న ఈ వేడుక కోసం కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ నుంచి కూడా క్లోజ్ ఫ్రెండ్స్ కు మాత్రమే పెళ్లికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అయితే వీరి పెళ్లికి ముందే కోర్టులు కేసు వేయడం హాట్ టాపిక్ గా మారింది.

    కఠినమైన ఆంక్షలు..

    కఠినమైన ఆంక్షలు..

    కత్రినా కౌషల్ పెళ్లి కారణంగా పలు దారులు మూసి వేయడంపై సాదారణ జనాల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. డిసెంబర్ 6-12 వరకు రాయల్ ప్యాలెస్ లో జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం హోటల్ నిర్వాహకులు అత్యంత కఠినమైన ఆంక్షలను విధించనున్నారు. ఎలాంటి గెస్ట్ అయినా సరే మొబైల్ ఫోన్ లోపలికి తీసుకు రావద్దని రూల్స్ పెట్టడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

    న్యాయ సేవల అథారిటీకి ఫిర్యాదు

    న్యాయ సేవల అథారిటీకి ఫిర్యాదు

    అత్యంత గోప్యంగా వీరు పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఇక పెళ్లి కోసం విక్కీ కౌషల్ గత నెల రోజుల నుంచి ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఖర్చు విషయంలో ఇరు కుటుంబ సభ్యులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని సమాచారం. ఇక వీరి పెళ్లి జరుగుతున్న ప్యాలెస్ లో చౌత్ మాతా ఆలయానికి వెళ్లే రహదారిని మూసివేయడంపై వ్యతిరేకిస్తూ రాజస్థాన్‌కు చెందిన న్యాయవాది, జిల్లా న్యాయ సేవల అథారిటీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ.

    రహదారిని మూసివేయడంపై..

    రహదారిని మూసివేయడంపై..

    ఆలయానికి వెళ్లే రహదారిని మూసివేయడంపై న్యాయవాది నైత్రాబింద్ సింగ్ జాదౌన్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సాదారణ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు. సెలబ్రిటీల వివాహ వేదిక అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా మేనేజర్ పై అలాగే బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ మరియు జిల్లా కలెక్టర్‌పై ఆయన ఫిర్యాదు చేశారు.

    జనాలను అడ్డుకోవడం ఏమిటి?

    జనాలను అడ్డుకోవడం ఏమిటి?

    ఈ ఫిర్యాదుతో పాటు భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వెళ్లే మార్గాన్ని వీలైనంత త్వరగా తెరిపించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఎలా జరుపుకున్నా కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే వారి పెళ్లి కోసం జనాలను దేవాలయాలకు వెళ్లకుండా దారులను అడ్డుకోవడం న్యాయం కాదని జాదౌన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

    తీవ్ర ఇబ్బందులు..

    తీవ్ర ఇబ్బందులు..

    చౌత్ కా బర్వారాలో శతాబ్దాల నాటి చౌత్ మాతా యొక్క చారిత్రక దేవాలయం ఉందని అయితే ప్రతిరోజూ అక్కడికి వందలాది మంది భక్తులు అమ్మవారిని సందర్శించి తమ ప్రార్థనలు చేస్తారని అన్నారు. ఇక ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న హోటల్ సిక్స్ సెన్సెస్ డిసెంబర్ 6-12 తేదీల మధ్య జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆలయానికి వెళ్లే రహదారిని హోటల్ మేనేజర్ మూసివేశారని ఆరోపించారు. ఈ కారణంగా ఆలయానికి వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

    Recommended Video

    Prabhas Dual role in Salaar. Eye feast for fans. Katrina kaif special song in Salaar
     మనోభావాలను దృష్టిలో ఉంచుకుని..

    మనోభావాలను దృష్టిలో ఉంచుకుని..

    ఆరు రోజుల పాటు హోటల్ సిక్స్ సెన్సెస్ నుంచి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిని పూర్తిగా మూసివేయడం సమన్యాయం కాదని.. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని హోటల్ సిక్స్ సెన్సెస్ ముందు నుంచి చౌత్ మాత ఆలయానికి వెళ్లే మార్గాన్ని తెరవాలని జదౌన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ విషయంపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

    English summary
    Complaint filed against Katrina kaif vicky kaushal wedding restrictions..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X