Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సల్మాన్‌ను భ్రష్టు పట్టించి.. రోడ్డుపైకి తెస్తా.. క్రిటిక్ కేఆర్కే ఛాలెంజ్
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌పై సినీ క్రిటిక్ కేఆర్కే అలియాస్ కమల్ ఆర్ ఖాన్ మరోసారి ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఇటీవల కేఆర్కేపై పరువు నష్టం దావా వేస్తూ సల్మాన్ ఖాన్ లీగల్ టీమ్ నోటీసులు పంపిన తర్వాత మరింత ఘాటుగా స్పందించాడు. వరుస ట్వీట్లతో ఆర్కేకే బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాడు. కొన్నిసార్లు సల్మాన్ ఖాన్‌పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ పరుషమైన ఆరోపణలు చేశారు. అతడికి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా అంటే చాలా మంది జీవితాలను, కెరీర్లను నాశనం చేశాడు. ఆయన కెరీర్‌ను నాశనం చేసి అతడి లైఫ్‌ను రోడ్డుపైకి తీసుకువస్తాను. నాకు 20 మందికిపైగా బాలీవుడ్ యాక్టర్ల మద్దతు ఉందంటూ సంచలన ట్వీట్లు చేశారు.
సల్మాన్ ఖాన్‌తో వివాదం తర్వాత నాకు 20 మంది బాలీవుడ్ ప్రముఖులు అండగా నిలిచారు. మేము ఏం చేయలేకపోతున్నామో అది నీవు చేస్తున్నావు. ఆయన (సల్మాన్)తో మేము నేరుగా గొడవ పెట్టుకొనే ధైర్యం లేదు. అతడితో శత్రుత్వం పెట్టుకోవడానికి భయపడుతున్నాం. నాకు మద్దతు తెలిపిన వారందరికి నా థ్యాంక్స్ చెప్పాను అంటూ సల్మాన్ గురించి కేఆర్కే ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు. ట్విట్టర్‌లోనే చాలా మంది ఏం చేయాలనే విషయంపై సలహాలు ఇస్తున్నారు. చాలా మంది జాగ్రత్తగా ఉండు. నిన్ను చంపేస్తాడని హెచ్చరిస్తున్నాడు. నా గురించి, నా క్షేమం గురించి ఆలోచిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. అయినా అతడికి భయపడేది లేదు. వాస్తవాలను బయటపెట్ేటందుకు పోరాటం చేస్తాను అంటూ కేఆర్కే ట్వీట్ చేశాడు.
రాధే చిత్రం చెత్తగా ఉన్నదని రివ్యూ రాసినందుకు సల్మాన్ ఖాన్ టీమ్ నోటీసులు పంపారనే విషయం మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఆ విషయంలో మేము నోటీసులు ఇవ్వలేదని, సల్మాన్ ఖాన్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా రాతలు రాసినందుకు మాత్రమే పరువు నష్టం దావా నోటీసులు ఇచ్చాం ఇటీవల లీగల్ టీమ్ క్లారిటీ ఇచ్చారు.