Don't Miss!
- News
Bengaluru: అపార్ట్ మెంట్ లో ఏం జరిగింది ?, ఆ ఇద్దరూ ఒకే సారి ఎలా చనిపోయారు ?, భార్య ఎంట్రీతో ?
- Sports
INDvsAUS : టెస్టు సిరీస్ తర్వాత.. అశ్విన్ వల్ల వీళ్లకు పీడకలలు తప్పవు!
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Finance
Adani Bonds: అదానీ డాలర్ బాండ్లకు ఎదురుదెబ్బ.. ప్రమోటర్ల తాజా నిర్ణయం ఏమిటంటే..
- Lifestyle
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఇంధ్రభవనం లాంటి ఇంటిని కొనుగోలు చేసి దీపిక, రణ్‌వీర్.. షారుక్ ఇంటి పక్కన బంగ్లా.. దాని ఖరీదు ఎంతో తెలుసా?
సినీ తారలు, సూపర్ స్టార్స్ ఇళ్లు ఎలా ఉంటాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్బుతమైన డిజైనింగ్, విదేశాల నుంచి తెప్పించిన గృహ ఉపకరణాలతో విలాసవంతమైన బంగ్లాలు ఇంధ్రభవనంలా ఉంటాయి. ఇక ముంబైలోని బాంద్రా అంటే అగ్ర హీరోల నివాసాల అడ్డా అనేది మరీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్ దంపతులు కొత్తగా కొనుగోలు చేసిన భవనం కళ్లు జిగేల్ అనడమే కాకుండా దాని ధర తెలిస్తే గుండె జారడం ఖాయం.. తాజాగా రణ్‌వీర్ సింగ్ కొనుగోలు చేసిన ఇంటి ధర, ఎలా ఉంటుందనే విషయంలోకి వెళితే..

బాంద్రా అంటే బాలీవుడ్‌కు అడ్డా
బాలీవుడ్‌కు బాంద్రాకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. బాంద్రాలోనే ఎక్కువ మంది సినీ తారలు నివసిస్తుంటారు. బాంద్రా అంటే సముద్ర తీరం.. షారుక్ ఖాన్ నివాసం ఠక్కున గుర్తుకు వస్తాయి. షారుక్ నివాసం ముంబైలోనే ఓ పర్యాటక కేంద్రమంటే అతిశయోక్తి కాదేమో. బాంద్రా అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది షారుక్ ఖాన్ నివాసం మన్నత్. ఇప్పుడు ఆ నివాసానికి సమీపంలోనే రణ్ వీర్, దీపిక దంపతులు భారీ ధరకు ఓ ఇంటిని కొనుగులు చేశారు.

తండ్రితో కలిసి కొత్త నివాసం కొనుగోలు
మీడియా రిపోర్టుల ప్రకారం.. రణ్‌వీర్, తన తండ్రి జగజీత్ సుందర్ సింగ్ భావ్‌నానీతో కలిసి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. రణ్‌వీర్ తండ్రికి సంబంధించిన సంస్థ ఫైవ్ హో మీడియా వర్క్స్ ఎల్ఎల్‌పీ సంస్థ పేరిట సముద్రానికి అభిముఖంగా ఉండే ఇంటిని కొనుగోలు చేశారు. త్వరలోనే ఆ ఇంటిలోకి రణ్‌వీర్ దంపతులు వెళ్లనున్నారు అని కథనం వెలువడింది.

రణ్‌వీర్ సింగ్ ఇంటి ఖరీదు ఎంతంటే?
అయితే షారుక్ ఖాన్ అధికార నివాసం మన్నత్‌కు సమీపంలోనే ఉండే రణ్‌వీర్ సింగ్ నివాసం 11266 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 1300 చదరపు అడుగుల టెర్రస్‌ను కలిగి ఉంటుంది. బాంద్రాలోని ప్రముఖ అపార్ట్‌మెంట్‌లోని 16వ అంతస్థు, 17, 18, 19 అంతస్తుల్లో రణ్‌వీర్ ఇళ్లు ఉంటుంది. అనేక సదుపాయాలు, సౌకర్యాలు, విలావంతమైన ఏర్పాట్లు ఉన్న ఈ ఇంటి ఖరీదు 119 కోట్ల రూపాయలు అని జాతీయ దిన పత్రిక కథనంలో పేర్కొన్నది.

దీపిక, రణ్‌వీర్ సింగ్ గతంలో
అయితే రణ్‌వీర్, దీపిక పదుకోన్ గతంలో కూడా విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. దీపిక పదుకోన్‌తో పెళ్లి తర్వాత రణ్‌వీర్ సింగ్ ముంబైలోని అలీబాగ్‌లో 22 కోట్ల వ్యయంతో 2021లోనే ఓ ఇంటిని కొనుగోలు చేశారు. పెళ్లికి ముందు కూడా రణ్‌వీర్, దీపిక పదుకోన్‌కు సొంత ఫ్లాట్స్ కూడా ఉండేవి.

రణ్‌వీర్ సింగ్ కెరీర్ గురించి
ఇక రణ్‌వీర్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సింబా అనే చిత్రం కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాక్వలైన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే, వరుణ్ శర్మ తదితరులు నటిస్తున్నారు. 1960 నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో రణ్‌వీర్ డబుల్ రోల్‌లో నటిస్తున్నారు. అంతేకాకుండా కరణ్ జోహర్ రూపొందించే రాకీ ఔ్ రాణీ కి ప్రేమ్ కహానీ చిత్రంలో నటిస్తున్నాడు. ఆలియాభట్, జయబచ్చన్, షబానా ఆజమీ, ధర్మేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.