twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీఎస్టీకి కుచ్చుటోపి.. కోట్ల కుంభకోణం.. బాలీవుడ్ దర్శకుడి అరెస్ట్!

    By Rajababu
    |

    జీఎస్టీ కట్టకుండా ఎగవేతకు పాల్పడిన బాలీవుడ్ దర్శకుడు విజయ్ రత్నాకర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. పన్ను చెల్లింపులో రూ.34 కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు గుర్తించిన విజయ్‌ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అదుపులోకి తీసుకొన్నది. ఈయనపై సీజీఎస్టీ యాక్ట్‌లోని సెక్షన్ 132 (1) (సీ) కింద కేసు నమోదు చేశారు. విజయ్ అరెస్ట్ వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ విషయంలో ఏం జరిగిందంటే..

    వివరాల్లోకి వెళితే.. నకిలీ బిల్లుల ద్వారా రూ.34 కోట్ల జీఎస్టీ క్రెడిట్‌ను విజయ్‌కి చెందిన కంపెనీ వీఆర్‌జీ క్లెయిమ్ చేసుకొన్నది. 266 కోట్ల విలువైన యానిమేషన్, సిబ్బంది సేవలను హరిజోన్ కంపెనీ ఉపయోగించుకొన్నట్టు నకిలీ ఇన్వాయిస్‌లో పేర్కొన్నది. ఈ వ్యవహారంలో వీఆర్‌జీ డిజిటల్ 34 కోట్లు, హరిజోన్ కంపెనీ రూ.170 కోట్ల జీఎస్టీకి మోసం చేసినట్టు గుర్తించారు. దాంతో ఈ రెండు కంపెనీలను సీజ్ చేసినట్టు తెలుస్తున్నది.

    Dr Manmohan Singh Biopic: Director Vijay Ratnakar arreste

    మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన విజయ్ ప్రస్తుతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నాడు. మన్మోహన్ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌' పుస్తకం ఆధారంగా ఈ చిత్్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

    English summary
    Vijay Gutte has been booked under Section 132 (1)(c) of the CGST Act, which pertains to “wrongful availment” of input tax credit using bills and invoices that have been issued without any supply of goods or services.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X