‘భార్య ఉండగానే ఆమెతో అమీర్‌ఖాన్ ఎఫైర్.. కడుపు చేసి’
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుడిగా, బాలీవుడ్‌కు ఐకాన్‌గా.. హిందీ చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఖాన్ త్రయంలో ఒకరిగా గుర్తింపు సంపాదించారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అమీర్‌ఖాన్.. తన వ్యక్తిత్వంతో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. గత కొద్దిరోజులుగా అమీర్‌ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన సోదరుడు ఫైసల్ ఖాన్. తాజాగా ఆయన మరో బాంబు పేల్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
పిచ్చోడిని చేశాడు
తనపై పిచ్చివాడిగా ముద్రవేసి, తనను రూమ్‌లో వేసి బంధించాడని ఫైసల్ ఖాన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనకు రావాల్సిన ఆస్తిని దక్కకుండా అమీర్ అడ్డుపడుతున్నాడంటూ కోర్టును సైతం ఆశ్రయించాడు ఫైసల్. తనకు మానసిక వ్యాధులు ఉన్న విషయం నిజమేనని, దీనికి తాను చికిత్స తీసుకుంటున్నానని .. అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ అమీర్ తనను పిచ్చివాడి కిందే లెక్కకట్టేవాడని ఆరోపించారు ఫైసల్. ఈ హింస నుంచి తనను రక్షించగలిగింది తన తండ్రి మాత్రమేనని, కానీ అమీర్ ఖాన్ తనను తండ్రిని కలవకుండా కట్టుదిట్టం చేశాడని ఆరోపించారు. అయితే ఈసారి ఏకంగా అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం, వివాహంపైనే వ్యాఖ్యలు చేశారు ఫైసల్ ఖాన్.

రెండు సార్లు పెళ్లి, విడాకులు
1986లో బాలీవుడ్ నటి రీనా దత్తాను పెళ్లాడిన అమీర్‌ఖాన్‌కు ఐరా ఖాన్, జునైద్ ఖాన్ సంతానం. అయితే అనూహ్యంగా ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత లగాన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్ రావుతో ప్రేమలో పడి ఆమెను పెళ్లాడారు అమీర్. ఈ దంపతులు సరోగసి విధానంలో ఆజాద్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. అమీర్‌కు రెండో పెళ్లి కూడా కలిసిరాలేదు.. ఇటీవలే అమీర్- కిరణ్ రావుల విడాకులు తీసుకున్నారు.
గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్
ఈ దశలో అమీర్‌ఖాన్ పలువురు హీరోయిన్‌లతో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. దంగల్ సినిమాలో తన కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్‌తో ఆయన డేటింగ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ దశలో బెంగళూరుకు చెందిన అమ్మాయితో అమీర్ రిలేషన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. వీటికి తెరదించుతూ తాను గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్‌లో ఉన్నానని త్వరలోనే ఆమెను పెళ్లాడబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు అమీర్ ఖాన్. తన ప్రియురాలిని తీసుకుని పబ్లిక్‌గా తిరుగుతున్నాడు అమీర్.
ఆమెతో బిడ్డను కన్నాడు
అయితే వీరే కాకుండా అమీర్‌కు తొలినాళ్లలోనే చాలామందితో ఎఫైర్లు ఉన్నాయని ఆరోపిస్తున్నాడు అతని తమ్ముడు ఫైసల్ ఖాన్. రీనా దత్తాని పెళ్లి చేసుకున్న కొత్తలోనే 1990లలో బ్రిటిష్ జర్నలిస్ట్ జెస్సికా హైన్స్ అనే అమ్మాయితో అమీర్‌ఖాన్ ఎఫైర్ పెట్టుకున్నాడని, వీరిద్దరికి ఓ బిడ్డ కూడా పుట్టాడని ఆయన ఆరోపించారు. రీనా దత్తాతో విడాకులు తీసుకున్నప్పటికీ ఎక్కువగా జెస్సికాతోనే గడిపేవాడని, వారు పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేశారని ఫైసల్ అన్నాడు. కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాకా కూడా జెస్సికాతో సాన్నహిత్యం కొనసాగించాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫైసల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నిజంగానే జెస్సికాతో అమీర్ రిలేషన్‌షిప్ కొనసాగించాడా లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తుండటంతో అమీర్ ఖాన్ స్వయంగా ఖండించే అవకాశం లేకపోలేదు.


Click it and Unblock the Notifications











