»   » రాక్షసుల్లా మాట్లాడకండి ..శ్రీదేవి మృతి గురించి సోషల్ మీడియాలో వైరల్!

రాక్షసుల్లా మాట్లాడకండి ..శ్రీదేవి మృతి గురించి సోషల్ మీడియాలో వైరల్!

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మృతికి సంబంధించి ప్రాధమిక వివరాలు మాత్రమే బయటకు వచ్చాయి. శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్ తో మృతిచెందారు. ఇది ఎలా జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి అనే వివరాలు తెలియాల్సి తెలియాల్సి ఉంది. ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తుంటాయి. శ్రీదేవి మృతి విషయంలో కూడా అదే జరిగింది. శ్రీదేవి ప్లాటిక్ సర్జరీ వలన మృతి చెందారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై బుల్లి తెర నిర్మాత ఏక్తాకపూర్ మండి పడింది. నెటిజన్ల పట్ల ఘాటుగా స్పదించింది. రాక్షసుల్లా మాట్లాడకండి అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.

పోస్టు మార్టం పూర్తయింది ఈ ఉదయమే

పోస్టు మార్టం పూర్తయింది ఈ ఉదయమే

శ్రీదేవి పార్థివ దేహాన్ని దుబాయ్ నుంచి ఇంకా తరలించాల్సి ఉంది. ఈ ఉదయమే శ్రీదేవి పార్థివ దేహానికి శవ పరీక్షలు పూర్తయ్యాయి. ఫోర్సెనిక్ నివేదిక రావాల్సి ఉంది. శ్రీదేవి మృతికి గల కారణాల గురించి అధికారిక సమాచారం వెలువడక ముందే సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

 శస్త్రచికిత్స కారణమా

శస్త్రచికిత్స కారణమా

శ్రీదేవి మృతికి ప్లాస్టిక్ సర్జరీ కారణం అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దీనితో ఈ అంశం వివాదంగా మారింది.

 రాక్షసుల్లా మాట్లాడకండి

రాక్షసుల్లా మాట్లాడకండి

సోషల్ మీడియాలో శ్రీదేవి మృతి గురించి ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న వార్తల పట్ల బుల్లితెర ఏక్తా కపూర్ ఘాటుగా స్పందించారు. రాక్షసుల్లా మాట్లాడకండి అంటూ చురకలంటించారు.

 కారణం గుండె పోటే

కారణం గుండె పోటే

శ్రీదేవి అకాల మరణానికి కారణం గుండె పోటే అని ఏక్తాకపూర్ అన్నారు. వైద్యుడి ద్వారా తాను తెలుసుకున్న వివరాల ప్రకారం హృద్రోగ సమస్యలు లేకపోయినా, సర్జరీలు చేయించుకోకపోయినా కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఏక్తాకపూర్ వెల్లడించారు.

 అవాస్తవాలు కట్టిపెట్టండి

అవాస్తవాలు కట్టిపెట్టండి

అవాస్తవాలు కట్టిపెట్టి శ్రీదేవి లాంటి నటికి గౌరవం ఇవ్వాలని ఏక్తాకపూర్ నెటిజన్లకు సూచించారు.

English summary
False news circulating in social media over Sridevi death. Ekta Kapoor fires on those people.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu