పోలీసులు బలవంతపెట్టారు.. అయినా నేను మాట వినలేదు.. సీక్రెట్స్ బయట పెట్టిన గెహనా!

పోర్న్ మూవీస్ రాకెట్ కేసులో మూడు ఎఫ్ఐఆర్లను ఎదుర్కొంటున్న నటి గెహనా వశిష్ట్ అలియాస్ వందనా తివారీ, ఫిబ్రవరిలో అరెస్ట్ కాగా దాదాపు నాలుగు నెలల జైలు శిక్షను కూడా అనుభవించింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమె పోలీసుల మీద కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తనను అరెస్టు చేసినా ముంబై పోలీసులు రాజ్ కుంద్రా మరియు ఏక్తా కపూర్ పేర్లు వెల్లడించమని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

అయితే, తాను అందుకు నిరాకరించానని వెల్లడించారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఒక నేషనల్ టీవీతో మాట్లాడుతూ, తనను అరెస్టు చేయకపోవడానికి బదులుగా ముంబై పోలీసులు తన నుంచి రూ .15 లక్షలు డిమాండ్ చేశారని కూడా గెహానా వశిష్ట్ పేర్కొన్నారు. "నేను వారికి డబ్బు చెల్లిస్తే వారు నన్ను అరెస్టు చేయరని పోలీసులు చెప్పారు." అని ఆమె వెల్లడించారు.

అయితే తాను ఎలాంటి డబ్బు చెల్లించాలి అని డబ్బు చెల్లిస్తే తాను తప్పు చేసినట్లు ఒప్పుకొన్నట్లేనని ఆమె పేర్కొంది. ఆ తదనంతర పరిస్థితుల్లో ఆమె అరెస్టయి దాదాపు నాలుగు నెలలు జైలులో కూడా ఉంది. అప్పట్లో ఆమెపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లలో బెయిల్ లభించడంతో ప్రస్తుతం ఆమె బయటే ఉంది. అయితే తనను బలవంతంగా పోర్న్ సినిమాలలో నటింపజేసే ప్రోత్సహించిందని పేర్కొంటూ ఒక నటి ఫిర్యాదు చేసింది.

Gehana Vasisth allegations on Mumbai police about Raj kundra case

ఈ నేపథ్యంలోనే ఆమె మీద క్రైమ్ బ్రాంచ్ మూడవ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇక తాజా ఇంటర్వ్యూలో రాజ్ కుంద్రా యొక్క మొబైల్ యాప్ 'హాట్‌షాట్స్' కోసం చిత్రీకరించబడిన కొన్ని "బోల్డ్ వీడియోల"లో తాను నటించానని ఆమె ఒప్పుకుంది, కానీ అది అశ్లీల వీడియోలు అయితే కాదని ఆమె మళ్లీ చెప్పింది. "నేను ఎలాంటి తప్పు చేయలేదని భావించినందున నేను పోలీసులకు డబ్బు చెల్లించలేదు.

నేను నటించిన వీడియోలు బోల్డ్ కంటెంట్ అవి అశ్లీలమైనవి కావు. అందువల్ల, నేను మరియు రాజ్ కుంద్రా తప్పు చేయలేదని ఇప్పటికే చెబుతున్నాను" అని గేహన అన్నారు. ఆమె కనుక వారి పేర్లు చెప్పడానికి నిరాకరిస్తే తీవ్ర "పరిణామాలు" ఉంటాయని పోలీసులు హెచ్చరించారని కూడా ఆమె పేర్కొంది. అయినా "నేను చలించలేదు మరియు నెలలు జైలులో గడిపాను. నేను ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను అంటే, ఈ విషయాలను బహిరంగపరచడం నాకు ఇష్టం లేదు కానీ పోలీసులు నన్ను బలవంతం చేసారు", అని ఆమె పేర్కొంది.

"వారు నన్ను అరెస్టు చేస్తారనే భయం నాలో వారికి కనిపించలేదు. అందుకే వారు నాపై కొత్త కేసు పెట్టారు మరియు నన్ను నిందితురాలిని చేసారు" అని ఆమె చెప్పింది. శుక్రవారం నాడు గెహానా వశిస్ట్ ముంబైలోని స్థానిక కోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X