twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ ఆఫర్ చేస్తారు, రాత్రి వెళ్లి గడుపుతారు: లేడీ ప్రొడ్యూసర్ సంచలనం!

    By Bojja Kumar
    |

    Recommended Video

    సెక్స్ ఆఫర్ చేస్తారు, రాత్రి గడుపుతారు

    సినిమా ఇండస్ట్రీ అంటేనే మనకు ఓ వైపు వినోదం... మరో వైపు కొన్ని చీకటి కోణాలు కనిపిస్తుంటాయి. ఆ చీకటి కోణాల్లో కాస్టింగ్ కౌచ్, సెక్సువల్ హెరాస్మెంట్ లాంటివి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కాస్టింగ్ కౌచ్, సెక్స్ స్కాండల్స్ గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖా దత్ నిర్వహిస్తున్న 'ది టౌన్ హాల్' అనే కార్యక్రమంలో పాల్గొన్న ఏక్తా కపూర్ ఇక్కడ చర్చలో హార్వీ వెయిన్‌స్టన్ ప్రస్తావన రాగా ఆసక్తికరంగా స్పందించారు.

    బాలీవుడ్ పరిశ్రమలో అలాంటివారు

    బాలీవుడ్ పరిశ్రమలో అలాంటివారు

    హాలీవుడ్లో హీరోయిన్లను సెక్సువల్ హరాస్మెంట్ చేసిన హార్వీ వెయిన్‌స్టన్ లాంటి నిర్మాతలు బాలీవుడ్లోనూ ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ తమ సెక్సువాలిటీని వాడుకుని అవకాశాలు దక్కించుకునే యాక్టర్లు కూడా ఉన్నారు అంటూ ఏక్తా కపూర్ వ్యాఖ్యానించారు.

    కేవలం ఒకే కోణంలో చూడొద్దు...

    కేవలం ఒకే కోణంలో చూడొద్దు...

    హార్వీ వెయిన్‌స్టన్ వ్యవహారం తర్వాత ఎక్కడి చూసినా నిర్మాతలు ఇలా చేస్తున్నారు....... అంటూ చర్చ జరుగుతోంది. యాక్టర్లను నిర్మాతలు సెక్స్ కోసం వాడుకుంటున్నారు అంటున్నారు. అది నిజమే. కానీ ఇది ఒక కోణం మాత్రమే. అవకాశాల కోసం, తమ పనులు చక్క దిద్దుకోవడం కోసం సెక్స్ ఆఫర్ చేస్తున్న యాక్టర్లు కూడా ఉన్నారు.... అని ఏక్తా కపూర్ తెలిపారు.

    అలా ఆలోచించడం సరికాదు

    అలా ఆలోచించడం సరికాదు

    పవర్ ఉన్న వ్యక్తులు(నిర్మాతలు) వారికి పవర్ ఉంది కాబట్టి (యాక్టర్లను సెక్స్ కోసం లొంగదీసుకోవడం) ఇలాంటివి వారే చేస్తారనే అభిప్రాయానికి రావడం, పవర్ లేని వ్యక్తులంతా బాధితులే అనే భావనకు రావడం సరికాదు.... అని ఏక్తా కపూర్ తెలిపారు.

    నిర్మాతతో రాత్రి వెళ్లి గడుపుతారు

    నిర్మాతతో రాత్రి వెళ్లి గడుపుతారు

    మన సినిమా ఇండస్ట్రీలో కొందరు యాక్టర్లు అర్దరాత్రి దాటిన తర్వాత నిర్మాతను వెళ్లి కలుస్తారు, అతడితో గడుపుతారు. మీతో రాత్రి గడిపాం కాబట్టి తమకు అవకాశం కావాలని అడిగితే నిర్మాత దానికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అతడు సపరేటుగా చూడొచ్చు. మరి ఇక్కడ విక్టిమ్ ఎవరు? అని ఏక్తాకపూర్ ప్రశ్నించారు.

    ఏక్తా కపూర్ తండ్రిపై సెక్సువల్ హరాస్మెంట్ కేసు

    ఏక్తా కపూర్ తండ్రిపై సెక్సువల్ హరాస్మెంట్ కేసు

    కాగా.... ఏక్తా కపూర్ తండ్రి జితేంద్ర మీద కొన్ని రోజుల క్రితం సెక్సువల్ హరాస్మెంట్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. జితేంద్ర కజిన్ అతడిపై ఈ కేసు పెట్టింది. 47 ఏళ్ల క్రితం అతడు తనపై అఘాయిత్యం చేశాడంటూ..... ఆమె ఇపుడు తెరపైకి రావడం సంచలనం అయింది. అయితే జితేంద్ర మాత్రం ఇది అవాస్తవం అని వాదిస్తున్నారు. తన పరువు ప్రతిష్టలు, వ్యాపారం దెబ్బతీయడానికి ప్రత్యర్థులు చేసిన కుట్రగా ఈ కేసును ఆయన పేర్కొన్నారు.

    English summary
    "I think there are Harvey Weinsteins in Bollywood, but there is probably an equal number of Harvey Weinsteins on the other side of the story, but people do not want to talk about that part. Yes, there are people in power like producers who use their power to take advantage of people, but at the same time there are people on the other side, like an actor or others who need the job, would also use their sexuality to get things done. Therefore, I believe that predators should not be put in a box based on power. It is always not true that the person who does not have power is the victim.” Ekta Kapoor
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X