For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కత్రినా పెళ్ళికి థాయిలాండ్ నుంచి కాయగూరలు.. వామ్మో, వంటకాల లిస్టు నెక్స్ట్ లెవల్ అంతే!

  |

  విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్‌ల ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌లు ఈరోజు డిసెంబర్ 7న ప్రారంభమవుతాయి. పెళ్లిలో ఈ జంట యొక్క ఫుడ్ మెనూ ఇండియన్ వెస్ట్రన్ మిక్స్ అయి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా బయటి నుండి వచ్చే కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని విక్కీ మరియు కత్రినా వ్యక్తిగతంగా మెనూ రూపొందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

  మెనూ తెలిస్తే

  మెనూ తెలిస్తే

  పెళ్లిలో, అతిథులు ఒక విషయం మీద మాత్రమే ఎక్కువ శ్రద్ధ చూపుతారు, అదే ఆహారం. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 6న ఇద్దరూ కుటుంబ సమేతంగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చాలా ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు పెళ్లిలో మెనూ ఏం ఉండబోతుందో తెలిస్తే మాములుగా ఉండదు.

  లైవ్ కచోరీ మరియు చాట్ స్టాల్స్

  లైవ్ కచోరీ మరియు చాట్ స్టాల్స్

  కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ మరియు వారి కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లోని వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు . రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని హోటల్ సిక్స్ సెన్సెస్ బర్వారా ఫోర్ట్‌లో వీరిద్దరి వివాహం జరగనుంది. జంట వివాహంలో ఫుడ్ మెనూలో లైవ్ కచోరీ మరియు చాట్ స్టాల్స్, కబాబ్‌లు మరియు సాంప్రదాయ రాజస్థానీ వంటకాలు ఉన్నాయి. ఇందులో ఇటాలియన్ చెఫ్ క్యూరేటెడ్ ఫైవ్ లెవల్ వెడ్డింగ్ కేక్ కూడా ఉంది.

  కబాబ్‌లు, ఫిష్ ప్లేటర్‌లు

  కబాబ్‌లు, ఫిష్ ప్లేటర్‌లు

  ఇండియా టుడే నివేదిక ప్రకారం, విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్‌ల వివాహంలో కచోరి, దహీ భల్లా మరియు ఫ్యూజన్ చాట్ యొక్క లైవ్ స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనితో పాటు థాయిలాండ్ నుంచి కాయగూరలతో కొన్ని ఉత్తర భారతీయ వంటకాలు కూడా ఉంటాయి, వీటిలో కబాబ్‌లు మరియు ఫిష్ ప్లేటర్‌లు ఉంటాయి. రాజస్థాన్ సంప్రదాయ ఆహారం దాల్ బాటి చుర్మా, ఇందులో 15 రకాల పప్పులు ఉంటాయి.

   భారతీయ వంటకాలు

  భారతీయ వంటకాలు

  ఇవి కాక నీలం మరియు తెలుపు రంగుల 5 టైర్ టిఫనీ కేక్ ఉంటుంది, దీనిని ఇటలీ చెఫ్‌లు తయారు చేస్తారు. పాన్ మరియు గోల్గప్ప యొక్క ప్రత్యేక స్టాల్స్ కూడా ఉంటాయి. ఇది కాకుండా, అనేక భారతీయ వంటకాలు వడ్డించబడతాయి. ఇక నేహా ధూపియా, అంగద్ బేడీ, కబీర్ ఖాన్, మినీ మాథుర్ సహా పలువురు విమానాశ్రయంలో కనిపించారు. అందరూ పెళ్లికి బయలుదేరారు.

   ప్రత్యేకంగా రిసెప్షన్‌

  ప్రత్యేకంగా రిసెప్షన్‌

  పెళ్లి అయిన తరువాత విక్కీ మరియు కత్రినా ఇద్దరూ ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నారు, దీనికి పరిశ్రమలోని ప్రజలందరూ హాజరవుతారు. అలాగే పెళ్లికి రాలేని వారి కోసం ఈ రిసెప్షన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  ఆ పాటలు వద్దు ప్లీజ్

  ఆ పాటలు వద్దు ప్లీజ్

  ఇక సంగీత్ ఫంక్షన్‌లో కత్రినా కైఫ్ తన పాపులర్ హిట్ సాంగ్‌లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. తన పెళ్లిలో, కత్రినా మరోసారి తన సొంత హిట్ పాటలను రీక్రియేట్ చేస్తుంది. తాజా నివేదికల ప్రకారం, కత్రినా తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ పాటను తన పెళ్లి, మెహందీ, సంగీత్ లేదా ఏదైనా ఫంక్షన్‌లో ప్లే చేయకూడదని కోరిందట. అందుకే పెళ్లికి సంబంధించిన పాటలను కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు.

  English summary
  Have a look at the food menu of Katrina Kaif, Vicky Kaushal wedding.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X