Don't Miss!
- News
‘అదానీ’ ముప్పు అంటూ మోడీపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టిన కేసీఆర్
- Lifestyle
క్యాన్సర్ చికిత్స తర్వాత శృంగార కోరికలు తగ్గుతాయా? సరిగ్గా సెక్స్ చేయలేరా?
- Sports
INDvsAUS : మాజీ ఆసీస్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే సమాధానం.. నోటమాట రాలేదుగా!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pathaan Movie: షారూఖ్ ఖాన్‌కు మరో షాక్.. హిందూ సంస్థ దాడి.. ఏకంగా కింద పడేసి మరీ దారుణంగా!
కొన్ని సినిమాలు ప్రకటించిన సమయం నుంచే దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతూ ఉంటాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం వివాదాల కారణంగా చర్చనీయాంశంగా మారుతుంటాయి. అలాంటి సినిమానే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటిస్తోన్న 'పఠాన్'. హాట్ సాంగ్‌తో వివాదంలో చిక్కుకున్న ఈ మూవీకి వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా యూనిట్‌కు హిందూ గ్రూపు బజరాజ్ దళ్ మరో భారీ షాక్ ఇచ్చింది. దీంతో మరోసారి ఈ మూవీ దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

పఠాన్‌గా మారిపోయిన షారూఖ్
చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న షారూఖ్ ఖాన్ ఇప్పుడు 'పఠాన్' అనే సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేస్తోన్నాడు. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
Lakshmi Manchu హాట్ సెల్ఫీ వైరల్.. మీరెప్పుడూ చూడని గ్లామర్ ట్రీట్!

బేషరమ్ పాటతో పెద్ద వివాదం
షారూఖ్
'పఠాన్'
మూవీ
నుంచి
రిలీజైన
బేషరమ్
రంగ్
సాంగ్
వివాదానికి
కేంద్ర
బిందువుగా
మారిన
సంగతి
తెలిసిందే.
ఈ
పాటలో
దీపికా
ధరించిన
కాస్ట్యూమ్స్‌పై
అభ్యంతరాలు
వ్యక్తం
అవడంతో
పాటు
అశ్లీలత
మోతాదు
మించిందన్న
విమర్శలు
వెల్లువెత్తాయి.
దీంతో
పఠాన్
మూవీని
బ్యాన్
చేయాలనే
డిమాండ్
చేస్తూ
హిందూ
సంస్థలు,
నెటిజన్లు
యమా
డిమాండ్
చేశారు.

ప్రముఖుల నుంచి వ్యతిరేకత
షారూఖ్ ఖాన్ నటిస్తోన్న 'పఠాన్' మూవీ వివాదం అంతకంతకూ చెలరేగుతూనే ఉంది. ఈ చిత్రంలోని 'బేషరమ్ రంగ్' సాంగ్ చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతోన్నాయి. అలాగే, ఈ మూవీ యూనిట్‌పై పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం విమర్శలు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై నిషేధం విధించాలని ఇటీవలే మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రా కూడా డిమాండ్ చేశారు.
స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా భూమిక: తడిచిన బట్టల్లో యమ ఘాటుగా!

మాల్‌పై బజరాజ్ దళ్ దాడి
క్రేజీ
కాంబినేషన్‌లో
ఎంతో
ప్రతిష్టాత్మకంగా
రాబోతున్న
'పఠాన్'
మూవీ
యూనిట్‌పై
ఇప్పటికీ
ఆగ్రహ
జ్వాలలు
కనిపిస్తూనే
ఉన్నాయి.
తాజాగా
హిందూ
సంస్థల్లో
ఒకటైన
బజరాజ్
దళ్
సభ్యులు
అహ్మదాబాద్‌లోని
ఆల్పావన్
మాల్‌లో
ఈ
సినిమా
ప్రమోషన్‌ను
అడ్డుకున్నారు.
అంతేకాదు,
అక్కడ
దాడి
చేసి
చాలా
సామాగ్రిని
ధ్వంసం
చేశారు.
దీంతో
ఇది
దేశ
వ్యాప్తంగా
హైలైట్
అవుతోంది.

పోస్టర్లు చించేసి కాళ్లతో తొక్కి
అహ్మదాబాద్‌లోని ఆల్పావన్ మాల్‌లో ఏర్పాటు చేసిన 'పఠాన్' మూవీ ప్రమోషనల్ పోస్టర్లను హిందూ సంస్థ బజరాజ్ దళ్ సభ్యులు తొలగించారు. అంతేకాదు, అక్కడ ఉన్న షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె పోస్టర్లను చించేయడంతో పాటు నేలపై వేసి కాళ్లతో తొక్కేశారు. అలాగే, ఈ మాల్‌లో 'పఠాన్' మూవీకి విడుదల చేయొద్దంటూ యాజమాన్యాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
హీరోయిన్‌పై వర్మ సంచలన పోస్ట్: ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F** అంటూ ఘోరంగా!

ఆ రోజున వస్తుందా? లేదా?
షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొణె జంటగా నటిస్తోన్న 'పఠాన్' మూవీని జనవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ చిత్రం వివాదంలో చిక్కుకోవడంతో పాటు తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.