Hrithik Roshan Dating పై గర్ల్‌ఫ్రెండ్ రియాక్షన్.. గోవాలో ప్రైవేట్ రిసార్టులో అలా అంటూ..
బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. భార్యకు విడాకులు ఇచ్చిన హృతిక్ గత కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే తాజాగా ముంబై వీధుల్లో ఓ మహిళతో మీడియా కంటికి చిక్కడంతో అతడి డేటింగ్ వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. తీరా ఎవరా అమ్మాయి అని ఆరా తీస్తే.. ఓ మ్యూజిక్ బ్రాండ్‌కు చెందిన సెలబ్రిటీ సబా ఆజాద్ అని తేలింది. అయితే హృతిక్ రోషన్‌తో తన బంధం గురించి వాస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ఈ రూమర్ల నేపథ్యంలో హృతిక్ రోషన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు మీ కోసం..

2014లో భార్యకు విడాకుల తర్వాత
ప్రముఖ నిర్మాత, దర్శకుడు సంజయ్ ఖాన్ కుమార్తె సుసాన్ ఖాన్‌తో ప్రేమలో పడిన హృతిక్ రోషన్ ఆమెను 2000 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2014లో వారిద్దరు విడిపోయారు. కానీ ఇప్పటికీ వారిద్దరు స్నేహితులుగా ఉన్నారు. పిల్లల బాధ్యతను ఇద్దరు పంచుకొన్నారు. ఇద్దరి ఇళ్లలో జరిగే ఫంక్షన్ల సందర్భంగా కలుసుకోవడం తెలిసిందే. లాక్‌డౌన్‌లో పిల్లల కోసం వారిద్దరూ ఒకే ఇంటిలో ఉండటం గమనార్హం.

కంగన రనౌత్‌తో పెళ్లి వ్యవహారం
అయితే భార్య సుసాన్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత పలువురు హీరోయిన్లతో అఫైర్లు అంటూ వార్తలు వచ్చినా అవి ఎక్కువ కాలం హల్‌చల్ సృష్టించలేకపోయాయి. కానీ కంగన రనౌత్‌తో అఫైర్ భారీ వివాదాన్ని సృష్టించింది. ఆ ఇద్దరి మధ్య నటించి లేఖ వ్యవహారం మీడియాలో భారీ తుఫాన్‌ను క్రియేట్ చేసింది. పెళ్లి చేసుకొంటానని మోసం చేశారనే విషయాన్ని కంగన రనౌత్ పదే పదే పలు ఇంటర్వ్యూలో చెప్పడం తెలిసిందే. అప్పటి నుంచి డేటింగ్, అఫైర్ వార్తలకు హృతిక్ దూరంగా ఉంటూ వస్తున్నాడు.

సబా ఆజాద్‌తో డిన్నర్ డేట్
అయితే తాజాగా సబా ఆజాద్ అనే సెలబ్రిటీతో డిన్నర్ డేట్‌కు వెళ్లడం మీడియాలో వైరల్ అయింది. ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ మీడియా కంటికి చిక్కడంతో సబాతో ఉన్న అఫైర్ బయటకు వచ్చింది. సబాతో హృతిక్ అఫైర్ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో వారి డేటింగ్ విషయానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం గోవాలో
హృతిక్, సబా ఆజాద్ మధ్య కొన్ని నెలలుగా డేటింగ్ వ్యవహారం జరుగుతున్నది. వారిద్దరూ ఇటీవల గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్డులో వెకేషన్ జరిపారు. ఈ వెకేషన్ సందర్భంగానే వారి మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి. గోవా ట్రిప్ వారిద్దరిని మరింత దగ్గర చేర్చింది. అప్పటి నుంచి హృతిక్, సబా తరచు కలుసుకొంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ కనిపించారు అని వారి స్నేహితులు తెలిపారు.

హృతిక్‌తో రిలేషన్ గురించి
హృతిక్ రోషన్‌తో డేటింగ్ రూమర్లపై సబా ఆజాద్ స్పందించింది. ఆయనతో రెస్టారెంట్‌కు వెళ్లింది నేనే అని చెప్పింది. కానీ రిలేషన్‌షిప్‌పై మాట్లాడటానికి నిరాకరించింది. జాతీయ మీడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ.. సారీ.. ఈ విషయం గురించి ఇప్పుడేమి చెప్పలేను. నేను వేరే మీటింగ్‌లో ఉన్నాను. తర్వాత మీకు ఫోన్ చేస్తాను అంటూ మొబైల్ సంభాషణను డిస్‌కనెక్ట్ చేసింది అని కథనం వెలువడింది.
Recommended Video

ఎవరీ సబా ఆజాద్ అంటే?
సబా ఆజాద్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కుమారుడు ఇమాద్ షాతో కలిసి మ్యూజిక్ బ్యాండ్‌ను నిర్వహిస్తున్నారు. దిల్ కబాడ్డీ అనే సినిమాతో 2008లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ముజ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగి చిత్రంల నటించారు. ఇటీవల నెటిఫ్లిక్స్ ఒరిజినల్ ఫీల్స్ లైక్ ఇష్క్ అనే సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం రాకెట్ బాయ్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


Click it and Unblock the Notifications











