»   » హృతిక్ రోషన్ ఎలక్ట్రిఫయింగ్ పెర్ఫార్మెన్స్, టీఆర్పీ రేటింగ్స్ అదుర్స్!

హృతిక్ రోషన్ ఎలక్ట్రిఫయింగ్ పెర్ఫార్మెన్స్, టీఆర్పీ రేటింగ్స్ అదుర్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల జరిగిన ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఎలక్ట్రిఫయింగ్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఈ వేడుక మొత్తానికి హృతిక్ పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలిచింది. బాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా దీన్ని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

చాలా కాలం తర్వాత హృతిక్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపించారు. ఈ కార్యక్రమాన్ని టీవీ ఛానల్స్ లైవ్ ప్రసారం చేశాయి. హృతిక్ ప్రదర్శన సమయంలో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రావడం విశేషం.

ఈ వేడుకలో హృతిక్ రోషన్ తన మోస్ట్ పాపులర్ చార్ట్‌బస్టర్స్ ధూమ్ మచాలె, సెనోరిటా, బావ్రే బావ్రే, ఇక్ పల్ కా జీనా లాంటి పాటలకు డాన్స్ చేశాడు. తన అద్భుతమైన మ్యాజిక్ మూమెంట్స్, క్లిష్టమైన స్టెప్స్‌ సైతం అవలీలగా వేస్తూ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాడు. అభిమానులైతే హృతిక్ లాంటి డాన్సర్ బాలీవుడ్లో లేరని ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Hrithik Roshans Electrifying Performance At The Opening Ceremony Of IPL Gains Highest TRP!

ప్రారంభోత్సవ వేడుకలో హృతిక్ పెర్ఫార్మెన్స్ అనంతరం స్టేడియం మొత్తం అభిమానుల కేరింతలతో మార్మోగిపోయింది. ఈ మధ్య కాలంలో హృతిక్ సినిమాల సందడి బాక్సాఫీసు వద్ద లేకున్నా ఆయనకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం హృతిక్ రోషన్ 'సూపర్ 30' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన కెరీర్లో తొలిసారి టీచర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా హృతిక్ తన సినీ కెరీర్లో చేస్తున్న మొట్టమొదటి బయోపిక్ కూడా ఇదే.

English summary
Superstar Hrithik Roshan not only stole the show with his stellar performance at the opening ceremony of IPL but his performance also became the high point of the ceremony. One of the best performers in Bollywood, Hrithik Roshan treated a live audience after a long time and the performance proves the wait was worth it. Taking the opening ceremony notches higher with his power-packed performance, Hrithik Roshan's performance recorded the highest TRP.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X