twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొలి ఆస్కార్ విజేత భాను అథయా కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్

    |

    భారతీయ సినిమా పరిశ్రమలో ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ భాను అథయా ఇకలేరు. సినీ రంగంలో దేశానికి తొలి ఆస్కార్ అవార్డును అందించిన ప్రతిభాశాలి భాను ముంబైలో అనారోగ్యతో కన్నుమూశారు. గత కొద్దికాలంగా తీవ్ర అస్వస్థతకు గురైన భాను అథయా చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మృతి వార్తతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని పలువురు తమ సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.

    1983లో లార్డ్ రిచర్డ్ అటెన్‌బరో రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం గాంధీకి ఆమె క్యాస్టూమ్ డిజైనర్‌గా జాన్ మోలో అనే వ్యక్తితో కలిసి పనిచేశారు. ఆ చిత్రానికి ఆమెకు ఆస్కార్ అవార్డు లభించింది. ఆ తర్వాత 1991లో లేకిన్, 2002లో లగాన్ చిత్రాలకు రెండు జాతీయ అవార్డులను అందుకొన్నారు.

    Indias first Oscar winner Bhanu Athaiya passed away in mumbai due to Brain tumour

    ప్రముఖ నటుడు, దర్శకుడు గురుదత్ రూపొందించిన సీఐడీ చిత్రంతో క్యాస్టూమ్ డిజైనర్‌గా కెరీర్‌ను ఆరంభించారు. గత 50 ఏళ్ల కెరీర్‌లో వందకుపైగా చిత్రాలకు పనిచేశారు. ప్యాసా, చౌద్వీన్‌ కా ఛాంద్, సాహిబ్ బీవీ ఐర్ గులామ్, స్వదేశ్ లాంటి చిత్రాలకు పనిచేశారు.

    కుటుంబ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం.. 2012 నుంచి ఆమె బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు. కొద్దికాలం క్రితం పక్షవాతం బారిన పడ్డారు. అప్పటి నుంచి ఓ వైపు శరీరభాగం అచేతనంగా మారింది. ఇటీవల కాలంలో ఆరోగ్యం మరింత క్షీణించింది. గురువారం ఉదయం ముంబైలోనే కన్నుమూశారు అని ఆమె కుమార్తె రాధిక మీడియాకు సమాచారం అందించారు. ఆమె అంత్యక్రియలను దక్షిణ ముంబైలోని చందన్‌వాడీ శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం నిర్వహించారు.

    English summary
    India's first Oscar winner Bhanu Athaiya passed away in mumbai due to Brain tumour. She was suffering with prolonged illness, confirmed her daughter Radhika to PTI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X