హాస్పిటల్ చేరిన అభిషేక్ బచ్చన్?.. ఐశ్వర్యరాయ్ దూరం.. లీలావతికి అమితాబ్

బాలీవుడ్‌లో జూనియర్ బచ్చన్ అభిషేక్ బచ్చన్‌కు గాయం కారణంగా హాస్పిటల్‌లో చేరారు. అభిషేక్ బచ్చన్ హాస్పిటల్‌లో చేరిన సమయంలో భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ అందుబాటులో లేకపోవడంతో తండ్రి బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. సోదరి శ్వేతా నంద బచ్చన్ పరామర్శించారు. అయితే ఈ వార్త మీడియాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే అభిషేక్ హాస్పిటల్‌లో చేరలేదని కొందరు చెబుతుండగా.. అమితాబ్, ఆయన కూతురు శ్వేత ఇద్దరు హాస్పిటల్‌లో కనిపించారు. దాంతో రకరకాల వార్తలు మీడియాలో జోరుగా షికారు చేశాయి. ఈ నేపథ్యంలో కొందరు అభిషేక్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకు అభిషేక్ బచ్చన్‌కు ఎలాంటి, ఎప్పుడు గాయమైందనే విషయంలోకి వెళితే..

అభిషేక్ బచ్చన్‌ చేతికి బ్యాండేజ్

అభిషేక్ బచ్చన్‌ చేతికి బ్యాండేజ్

ఇటీవల అభిషేక్ బచ్చన్ హాస్పిటల్‌లో చేరిన సమయంలో చేతికి బ్యాండేజ్‌తో కూడిన ఫోటోలు బయటకు వచ్చాయి. భుజానికి చేతికి పట్టి వేసుకొని అభిషేక్ ఆ ఫోటోల్లో కనిపించారు. అయితే అభిషేక్‌కు ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో మీడియా వర్గాలు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశాయి. ఈ క్రమంలో చేతికి గాయమైనట్టు సమాచారం బయటకు వచ్చింది.

ఐశ్వర్యరాయ్ ముంబైలో లేకపోవడంతో

ఐశ్వర్యరాయ్ ముంబైలో లేకపోవడంతో

అభిషేక్ బచ్చన్‌కు గతంలో జరిగిన చిన్న ప్రమాదంలో చేతికి గాయమైంది. అయితే ఇటీవల ఆ గాయం తిరగదోడటంతో ఇటీవల క్రితం ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేరారు. అయితే ఈ సమయంలో ఐశ్వర్యరాయ్ ముంబైలో లేకపోవడం గమనార్హం. దాంతో తండ్రి, సోదరి ఇద్దరు కలిసి అభిషేక్‌ను లీలావతి హాస్పిటల్‌లో పరామర్శించారు.

లీలావతిలో అమితాబ్ బచ్చన్

లీలావతిలో అమితాబ్ బచ్చన్

ఆగస్టు 22వ తేదీ రాత్రి అమితాబ్ బచ్చన్, శ్వేత నందా బచ్చన్ కలిసి లీలావతి హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. అమితాబ్ సాదాసీదాగా కుర్తా, పైజామాలో హాస్పిట్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియా కంటపడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

దాంతో అభిషేక్ హాస్పిటల్‌లో చేరిన విషయాన్ని సినీ వర్గాలు ధృవీకరించాయి. అయితే అమితాబ్ రొటీన్ చెకప్స్ కోసం కూతురుతో కలిసి హాస్పిటల్‌కు వెళ్లారనే వార్త కూడా వైరల్ అవుతున్నది. అయితే అధికారికంగా ఎలాంటి విషయాన్ని వెల్లడించకపోవడం అనేక సందేహాలకు దారి తీసింది.

మణిరత్నం మూవీ షూటింగులో ఐశ్వర్యరాయ్

మణిరత్నం మూవీ షూటింగులో ఐశ్వర్యరాయ్

అయితే అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌లో షూటింగ్‌తో బీజీగా ఉన్నారు. ఆమె కొద్ది రోజులుగా మణిర్నత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్ర షూటింగులో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఐశ్వర్యరాయ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే ప్రకాశ్ రాజ్, మణిరత్నం ఆ సినిమా షూటింగుకు వెళ్తూ ఎయిర్‌పోర్టులో దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

Recommended Video

Prabhas ప్యాన్ ఇండియా స్టార్ నుండి Universal Star గా మారుతాడు | #PrabhasNagshwin || Filmibeat Telugu
అభిషేక్, బిగ్ బీ సినిమాలు

అభిషేక్, బిగ్ బీ సినిమాలు

అభిషేక్ బచ్చన్ కెరీర్ విషయానికి వస్తే... ఇటీవల లుడో, ది బిగ్‌ బుల్ లాంటి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం బాబ్ బిస్వాస్, దాస్వి చిత్రాల్లో నటిస్తున్నారు. విద్యాబాలన్ నటించిన కహాని సినిమాకు కొనసాగింపుగా వస్తున్న చిత్రంలో చిత్రంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమితాబ్ ప్రస్తుతం బ్రహ్మస్త్ర, చెహ్రే, గుడ్ బై, మేడే చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X