Don't Miss!
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- News
YS Avinash Reddy : అవినాష్ కు సీబీఐ ప్రశ్నలివే-2గంటలకు పైగా విచారణ-లాయర్ కూ నో ఎంట్రీ..!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Kiara Advani తో పెళ్లి.. రష్మిక మందన్న ముందే కమిట్ అయిన సిద్దార్థ్ మల్హోత్రా!
బాలీవుడ్‌లో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్‌గా మీడియాలో కొనసాగుతుండటం కొద్ది నెలలుగా సాగుతున్నది. అయితే గత రెండేళ్లుగా వారిద్దరి పెళ్లి వార్త రకరకాలుగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఎప్పుడూ సిద్దార్థ్ గానీ, కియారా అద్వానీ పెదవి విప్పిన దాఖలాలు లేవు. అయితే తాజాగా సిద్దార్థ్ నటిస్తున్న మిషన్ మజ్ను సినిమా ప్రచార కార్యక్రమాల్లో తన పెళ్లి గురించి క్లారిటీ ఇస్తూ..

మిషన్ మజ్ను చిత్రంతో
సిద్దార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నతో కలిసి మిషన్ మజ్ను చిత్రంలో నటించారు. ఈ సినిమా జనవరి 20 తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమైంది. ఓటీటీలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సిద్దార్థ్, రష్మిక మందన్న భారీగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ముంబైలో పంచుకొంటున్నారు.

కియారా అద్వానీతో పెళ్లి ఎప్పుడు?
ముంబైలో
జరుగుతున్న
మిషన్
మజ్ను
సినిమా
ప్రమోషన్స్‌లో
కియారా
అద్వానీని
పెళ్లి
ఎప్పుడు
చేసుకొంటావు?
అని
అడిగిన
ప్రశ్నకు
పరోక్షంగా
సమాధానం
ఇచ్చారు.
కియారా
పేరు
ఎత్తకుండానే..
వచ్చే
ఏడాదిలో
పెళ్లి
చేసుకొనేందుకు
ప్లాన్
చేస్తున్నాను.
కొద్ది
రోజుల్లో
నా
పెళ్లి
ఎప్పుడు?
ఎక్కడ
అనేది
క్లియర్‌గా
ఇస్తాను
అని
సిద్దార్థ్
మల్హోత్రా
తెలిపారు.

సిద్దార్థ్‌ను ఆటపట్టించిన రష్మిక మందన్న
సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి విషయం ఎత్తగానే.. పక్కనే ఉన్న రష్మిక మందన్న ఒకింత షాక్ తిన్నది. అయితే సిద్దార్థ్ చాలా సీరియస్‌గా చెబుతుండటంతో కాస్త రిలీఫ్‌గా ఫీలయ్యింది. అయితే సిద్దార్థ్ తన ప్రేమ, పెళ్లి గురించి చెబుతున్న విషయాలు వింటూ నవ్వుల్లో మునిగిపోయింది. ఆ తర్వాత సిద్దార్థ్‌ను ఆటపట్టించే ప్రయత్నం చేసింది.

డిసెంబర్ చివరి వారంలో
ఇదిలా ఉండగా, కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే డిసెంబర్ చివరి వారంలో వీరిద్దరి పెళ్లి తేదీ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అయితే కియారా, సిద్దార్థ్ పెళ్లి ఢిల్లీలో గానీ, ముంబైలో గానీ జరిగే అవకాశం ఉంది. అయితే పెళ్లికి సంబంధించిన పనులు, ఇతర కార్యక్రమాలను ఇరు కుటుంబాలు మొదలుపెట్టాయని ముంబైలో ఓ వార్త ప్రచారం జరుగుతున్నది.

చంఢీగఢ్‌లో కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి
అయితే కుటుంబ సభ్యులు మీడియాతో పంచుకొన్న ప్రకారం.. కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లిని చంఢీగఢ్‌లోని ఒబెరాయ్ సుకువిల్లాలో ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సిద్దార్థ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉండే చండీగఢ్‌లో అయితే ఢిల్లీకి కూడా దగ్గరగా ఉంటుందనేది ఫ్యామిలీ అభిప్రాయం. ఒకవేళ చండీగఢ్‌లో వివాహం జరిగితే.. ముంబైలో సినీ పరిశ్రమ ప్రముఖులకు, స్నేహితులు, సన్నిహితులకు విందు ఏర్పాటు చేయాలని సిద్దార్థ్ భావిస్తున్నట్టు సమాచారం.