»   » అచ్చం శ్రీదేవిలాగే చీర కట్టిన జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!

అచ్చం శ్రీదేవిలాగే చీర కట్టిన జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణం నుంచి ఆమె కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. శ్రీదేవి మరణించిన తరువాత బోనికపూర్, ఇద్దరు పిల్లలు జాన్వీ, ఖుషి కపూర్ తీవ్ర శోకంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మెల్లగా ఆ భాద నుంచి వారు బయట పడ్డారు. జాన్వీ ఇటీవల తన తొలి చిత్రం దఢక్ చిత్రాన్ని పూర్తి చేసింది. ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డులలో శ్రీదేవికి ఉత్తమ నటిగా ఎంపికైన సంగతి తెలిసిందే.

మామ్ చిత్రానికి గాను శ్రీదేవికి ఈ అవార్డు దక్కింది. శ్రీదేవి మరణం తరువాత వచ్చిన అవార్డు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు బాగా ఎమోషనల్ అయ్యారు. తాజగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. తల్లి కాకపోవడంతో అవార్డుని అందుకునేందుకు జాన్వీ కపూర్ హాజరయ్యింది. ఇక్కడ జాన్వీ కపూర్ ప్రధాన ఆకర్షణగా మారింది.

Janhvi Kapoor looks just like Sridevi

అచ్చం శ్రీదేవిలాగే జాన్వీ కపూర్ చీరకట్టులో కనిపించడం విశేషం. దానికి సంబందించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జాన్వీ కట్టిన ఇలాంటి చీరలోనే గతంలో శ్రీదేవి కనిపించింది.ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

English summary
Janhvi Kapoor looks just like Sridevi. Janhvi Kapoor recives national award of Sridevi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X