»   » ఫోటోస్ వైరల్: బాలీవుడ్ ఫ్యూచర్ క్వీన్ జాహ్నవి కపూర్...

ఫోటోస్ వైరల్: బాలీవుడ్ ఫ్యూచర్ క్వీన్ జాహ్నవి కపూర్...

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Janhvi Kapoor Looks Stunning In New Outfit

  శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ఇపుడు బాలీవుడ్లో సరికొత్త సెన్సేషన్. త్వరలో 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న ఈ కపూర్ బేటీ ఫ్యూచర్లో బాలీవుడ్ ఫ్యాషన్ క్వీన్‌గా ఇండస్ట్రీని ఏలడం ఖాయం అని, తన అందంతో హిందీ పరిశ్రమను అల్లాడిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రబల్ గురుంగ్ అనే ఇంటర్నేషనల్ డిజైనర్ బుధవారం జాహ్నవిని కలిశాడు. ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లేటెస్ట్ ట్రెండీ ఔట్‌ఫిట్స్ తీసుకొచ్చాడు. ఈ దుస్తువుల్లో జాను సరికొత్త లుక్‍‌తో దర్శనమిచ్చి అభిమానుల మతి పోగొట్టింది.

  వైరల్ అవుతున్న జాహ్నవి మిడ్ రిప్ ఫోటోస్

  ఈ సందర్భంగా బాలీవుడ్ ఫ్యూచర్ ఫ్యాషన్ క్వీన్ జాహ్నవి అంటూ ప్రబల్ ట్వీట్ చేశాడు. మిడ్ రిప్స్ ఎక్స్ ఫోజ్ అయ్యేలా అతడు డిజైన్ చేసిన దుస్తువుల్లో జాహ్నవి మరింత అందంగా, హాట్‌గా కనిపిస్తోందంటూ ఈ ఫోటోలపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

  అమెరికన్ బేస్డ్ డిజైనర్

  అమెరికన్ బేస్డ్ డిజైనర్

  ప్రబల్ గురుంగ్ నేపాలీ సంతతికి చెందిన అమెరికన్ డిజైనర్. న్యూయార్క్ కేంద్రంగా పలువురు హాలీవుడ్ సెలబ్రిటీల కోసం సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ డిజైన్ చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు. అతడి క్లయింట్ల ఖాతాలో ఇపుడు జాహ్నవి కపూర్ కూడా చేరిపోయింది.

  షూటింగులో జాహ్నవి బిజీ

  షూటింగులో జాహ్నవి బిజీ

  జాహ్నవి కపూర్ త్వరలో ‘ధడక్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతోంది. జులై 6 ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ చివరి దశలో ఉంది. తల్లి శ్రీదేవి మరణం, ఇటీవల సోనమ్ కపూర్ పెళ్లి కారణంగా జాహ్నవి సెలవు తీసుకోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

   ధడక్

  ధడక్

  ‘ధడక్' చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరాఠీ హిట్ మూవీ సైరాట్ చిత్రానికి ఇది రీమేక్. జాహ్నవికి పోడీగా హిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ నటిస్తున్నాడు. ధర్మాప్రొడక్షన్స్ బేనర్లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

  English summary
  Janhvi Kapoor may be the next big thing in Bollywood and fashion designer Prabal Gurung has given his seal of approval to that thought. The popular designer met Janhvi on Wednesday and decreed her the one upcoming actor to look out for. “Guess who stopped by the showroom? The Future!! Y’all remember this name #JanhviKapoor. Janhvi wish you all the happiness, joy and success. May you reach for the moon with your feet always on the ground. Rooting for you. With love xPG. #Bollywood,” he wrote on Twitter. Janhvi was also ecstatic about meeting him. “Felt like home meeting Prabal Gurung (can we please appreciate how cool I felt saying that),” she posted on her Instagram story.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more