బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు కథలకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హిట్టు ప్లాప్ అని తేడా లేకుండా కథ నచ్చితే వెంటనే తెరపైకి తెస్తున్నారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రికార్డులు సృష్టించకపోయినా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలాంటి కథలతోనే నార్త్ హీరోలు బాక్సాఫీస్ హిట్టు కొట్టాలని చూస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక యావరేజ్ సినిమా కూడా త్వరలో బాలీవుడ్ లో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమా 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే హిట్ కాలేదు గాని ఒక వర్గం ఆడియేన కి మాత్రం బాగానే నచ్చేసింది.
ఇక అలాంటి సినిమాను కొత్తగా తెరకెక్కిస్తే హిట్టవుతుందని ఒక బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో అక్షయ్ కుమార్ ఊసరవెల్లి రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాట్లు టాక్ అయితే గట్టిగానే వచ్చింది.
ఇక ఇప్పుడు మరొక ప్రొడక్షన్ హౌజ్ ఆయనతో చేతులు కలిపి సినిమాను తెరకెక్కించబోతున్నట్లు టాక్ వస్తోంది. భాగమతి హిందీ రీమేక్ ను నిర్మించిన నిర్మాతల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఆయన తెలుగు కథలపై ఈ మధ్య ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ఊసరవెల్లిపై కూడా అఫిషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతోంది. అయితే సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారా లేక మరొక హీరోను సెలెక్ట్ చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
Needless to say, the demand for Telugu stories in the Bollywood industry is in a special range. If you like the story without the difference that the flour flop is immediately brought to the screen. Some of the films received critical acclaim even though they did not create big records at the box office. With such stories North Heroes is looking to hit the box office. It seems that an average movie related to Junior NTR will also be remade in Bollywood soon.
Story first published: Friday, November 27, 2020, 11:25 [IST]