అలియా-రణవీర్ పెళ్లి, విడాకుల టైం చెప్పేసిన ఖాన్, ఎవర్నీ వదలట్లేదుగా!
ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ తర్వాత కొన్నేళ్ళకు విడాకులు తీసుకోవడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్ అయిపోయింది. ఇంకా బాలీవుడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అవి కోకొల్లలు. అయితే తాజాగా ఒక జంట విడాకులు తీసుకోగా ఇప్పుడు కమల్ ఆర్ ఖాన్ మరో రచ్చ రేపాడు. ఆ వివరాల్లోకి వెళితే

విడాకులు తీసుకోని వారే తక్కువ
బాలీవుడ్ లో విడాకులు తీసుకోని హీరోలు తక్కువ అనే చెప్పాలి. హృతిక్ రోషన్, ఆమీర్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్.. ఇలా ఎంతోమంది విడాకులు తీసుకున్న హీరోలు ఉన్నారు. ఇక రాబోయే పదేళ్ళలో ప్రియాంక చోప్రా కూడా విడాకులు తీసుకుతుందని వెల్లడించి రచ్చ రేపాడు సినీ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్. 'ప్రియాంకకు ఆమె భర్త నిక్ జోనస్ మరో 10 ఏళ్లలో విడాకులు ఇవ్వడం తథ్యం' అంటూ ఓ ట్వీట్ వదిలాడు.

మళ్ళీ రెచ్చిపోయాడుగా
అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు, ఆమె అభిమానులు ఆయన మీద ఫైర్ అయ్యారు. ఇక అక్కడితో ఆగని ఖాన్ ఈరోజు మళ్ళీ రెచ్చిపోయాడు. ఈ స్వయం ప్రకటిత విమర్శకుడు ఇప్పుడు రణబీర్ కపూర్ మరియు అలియా భట్ వివాహం గురించి విచిత్రమైన అంచనా వేశారు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న రణబీర్ మరియు అలియా 2022 చివరి నాటికి వివాహం చేసుకుంటారని KRK అంచనా వేశారు.

పెళ్లి - విడాకులు
అంతే కాదు, ఇద్దరు నటుల విడాకుల గురించి కూడా KRK అంచనా వేశాడు. రణబీర్ కపూర్ వివాహం చేసుకున్న 15 సంవత్సరాలలో అలియా భట్ తో విడాకులు తీసుకుంటారని కమల్ ఖాన్ చెప్పారు. ట్విట్టర్‌లో ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "ప్రిడిక్షన్ 08- రణబీర్ కపూర్ మరియు అలియా భట్ 2022 చివరి వరకు వివాహం చేసుకుంటారు. అయితే రణబీర్ కపూర్ వివాహం తర్వాత 15 సంవత్సరాలలోపు విడాకులు తీసుకుంటారు!" అంటూ ఆయన ట్వీట్ చేశారు.

విరుచుకుపడుతున్న నెటిజన్లు
KRK ట్వీట్‌పై నెటిజన్లు విరుచుకుపడున్నారు. ఆయన యొక్క వింత అంచనాల గురించి చాలామంది ఎగతాళి చేశారు. "మంచి అంచనా .. జ్యోతిష్కుడిగా మీ కెరీర్ మంచిగా సాగిపోతుంది" అని మరొకరు రాశారు, "15 సంవత్సరాలా ? చాలా ఎక్కువ చెప్పినట్టున్నావే'' అని కామెంట్ చేస్తున్నారు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ"ప్రిడిక్షన్ - రణబీర్ ఎప్పటికీ అలియా భట్‌ను వివాహం చేసుకోడు," అని రాసుకొచ్చారు.
Recommended Video

పెళ్లెప్పుడో?
ఇదిలావుండగా, గత ఏడాది సోషల్ మీడియాలో పుకార్లు వెలువడినప్పటి నుండి అలియా మరియు రణబీర్ అభిమానులు తమ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం COVID-19 లాక్ డౌన్ సమయంలో అలియాతో కలిసి నివసిస్తున్న రణబీర్, "మహమ్మారి మన జీవితాలను తాకకపోతే పెళ్లి ఇప్పటికే జరిగిపోయి ఉండేదని పేర్కొన్నారు. చూడాలి మరి ఎప్పటికి కుదురుతుంది అనేది.


Click it and Unblock the Notifications











